Health Tips: ఈ సమస్యలు ఉన్న వారు పొరపాటున కూడా గుమ్మడికాయ తినొద్దు..
ABN, Publish Date - Aug 02 , 2025 | 10:25 AM
గుమ్మడి కాయతో పాటూ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని సమస్యలు ఉన్న వారు దీనికి దూరంగా ఉండడం ఉత్తమం.

గుమ్మడి కాయతో పాటూ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని సమస్యలు ఉన్న వారు దీనికి దూరంగా ఉండడం ఉత్తమం. ఎవరెవరు గుమ్మడికాయకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉన్నవారు గుమ్మడికాయకు దూరంగా ఉండటం మంచిది. గుమ్మడికాయ తినడం వల్ల జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉంది. ఫుడ్ అలర్జీ ఉన్న వారు గుమ్మడికాయ తినడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడి, సమస్య మరింత తీవ్రం కావచ్చు.

గర్భిణులు, పాలిచ్చే తల్లులు గుమ్మడికాయ తినకపోవడం ఉత్తమం. ప్రధానంగా గర్భిణులు ఆహారం తీసుకునే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించాలి.

డయాబెటిక్ పేషెంట్లు వీటికి దూరంగా ఉండాలి. గుమ్మడికాయ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటుంది. ఇది మధుమేహ రోగులకు హాని చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం పడుతుంది.

అధిక రక్తపోటుకు మందులు తీసుకుంటున్నట్లయితే గుమ్మడికాయకు దూరంగా ఉండడం బెటర్. గుమ్మడికాయ రక్తపోటును మరింత తగ్గించి.. కొన్ని సమస్యలకు దారితీయొచ్చు. దీన్ని తీసుకునే ముందు వైద్యుడి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మూత్రపిండాల సమస్యలు ఉన్నవారితో పాటూ కిడ్నీలకు సంబంధించిన మందులు వాడుతున్న వారు గుమ్మడికాయ తినేముందు వైద్యుడి సలహాలు తీసుకోవాలి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Aug 02 , 2025 | 10:25 AM