Fridge Usage Tips: వేసవిలో ఈ వస్తువులను ఫ్రిజ్‌లో పెట్టారంటే.. ప్రమాదంలో పడ్డట్లే..
ABN, Publish Date - Apr 26 , 2025 | 02:45 PM
ఇంట్లో కూరగాయల దగ్గర నుంచి పాలు, పెరుగు, పిండి పదార్థాలు ఇలా అన్నింటినీ ఫ్రిడ్జ్‌లో పెట్టడం అందరికీ అలవాటు. అయితే వేసవిలో కొన్ని వస్తువులను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల చెడిపోయే ప్రమాదం ఉంది.

ఇంట్లో కూరగాయల దగ్గర నుంచి పాలు, పెరుగు, పిండి పదార్థాలు ఇలా అన్నింటినీ ఫ్రిడ్జ్‌లో పెట్టడం అందరికీ అలవాటు. అయితే వేసవిలో కొన్ని వస్తువులను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవిలో ఏ వస్తువులను ఫ్రిడ్జ్‌కు దూరంగా ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో తేనెను ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదు. దీన్ని ఉంచడం వల్ల ఇందులో స్పటికాలు ఏర్పడతాయి. దీనివల్ల సిరప్, టీ తదితరాలో కలిపేందుకు కష్టమవుతుంది. ఆరోగ్యంపై దీని ప్రభావం చాలా వరకూ తగ్గుతుంది.

ఉల్లి, వెల్లుల్లిని కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచవద్దు. తేమ కారణంగా వీటిలో మొలకలు వస్తాయి. దీనివల్ల వాటి ప్రభావం తగ్గుతుంది. కాబట్టి వీటిని గాలి తగిలేలా బుట్టలు, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.

బంగాళాదుంపలను కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదు. చలి ప్రదేశంలో ఉంచడం వల్ల బంగాళాదుంపలు చక్కెరగా మారతాయి. వీటిని వేయించడం వల్ల విషంగా మారతాయి. ఇలాంటి వాటిని ఎక్కువా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

బ్రెడ్, కాల్చిన వస్తువులను ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదు. గట్టిపడిన బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.

అరటిపండ్లు ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల తొక్క నల్లగా మారి గుజ్జు గట్టిగా మారతుంది. చల్లటి అరటిపండులో విటమిన్ B6, రెసిస్టెంట్ స్టార్చ్ తదితర పోషకాలు ఉండవు.

వేసవిలో టమాటాలను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల దీని గుజ్జు తీపిగా జ్యూసీగా ఉండడానికి బదులుగా పొడిగా రుచి లేకుండా మారిపోతుంది. అలాగే ఇందులో లైకోపీన్, విటమిన్-సి తగ్గడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.
Updated at - Apr 26 , 2025 | 02:45 PM