Coriander: మీ ఇంటి పెరట్లో కొత్తిమీర పెంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
ABN, Publish Date - Apr 25 , 2025 | 09:53 PM
అన్ని వంటకాల్లో తరచుగా కొత్తిమీరను ఉపయోగించడం సర్వసాధారణం. చాలా మంది కొత్తిమీరను ఇంటి పెరట్లో పెంచుకోవడం అలవాటుగా చేసుకుంటుంటారు.

అన్ని వంటకాల్లో తరచుగా కొత్తిమీరను ఉపయోగించడం సర్వసాధారణం. చాలా మంది కొత్తిమీరను ఇంటి పెరట్లో పెంచుకోవడం అలవాటుగా చేసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

కొత్తిమీరలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం తదితర ముఖ్యమైన ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి.

కొత్తిమీర జీర్ణక్రియ సమస్యలకు బాగా పని చేస్తుంది. కడుపు ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గించడంలో బాగా పని చేస్తుంది.

కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

కొత్తిమీరలో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎముకల బలానికి సహాయపడతాయి.

చర్మంపై మచ్చలు, మొటిమలను తగ్గించడంలో కొత్తిమీర సహాయపడుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Apr 25 , 2025 | 09:53 PM