Summer Health Tips: వేసవిలో ఈ 5 టిప్స్ ఫాలో అయితే.. అసిడిటీ సమస్య దూరమైనట్లే..
ABN, Publish Date - Apr 25 , 2025 | 03:14 PM
వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిలో అసిడిటీ సమస్య ఒకటి. గుండెల్లో మంట, అజీర్ణం తదితర సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.

వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిలో అసిడిటీ సమస్య ఒకటి. గుండెల్లో మంట, అజీర్ణం తదితర సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నివారణకు చాలా మంది మందులు తీసుకుంటుంటారు. అయితే మందులు వాడకుండా కేవలం ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెల్లో మంటగా ఉన్న సమయంలో చక్కెర లేని చల్లని పాలు తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. పాలలోని కాల్షియం కడుపు లోపలి పొరను చల్లబరుస్తుంది.

మజ్జిగలోని ప్రోబయోటిక్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మజ్జిగలో వేయించిన జీలకర్ర, నల్ల ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరం కూడా చల్లగా ఉంటుంది.

కొబ్బరి నీరు శరీరంలోని పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. అలాగే శరీరం నుంచి విషాన్ని బయటికి పంపడంలో సాయం చేస్తాయి.

కడుపులోని వేడిని చల్లబరచడంలో జీలకర్ర బాగా పని చేస్తుంది. రోజూ భోజనం తర్వాత కొద్దిగా చక్కెర, జీలకర్ర నమలడం వల్ల ఆసిడిటీ సమస్య తగ్గడంతో పాటూ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

నిమ్మకాయలోని సిట్రిక్ ఆమ్లం కడుపులో ఆమ్ల సమతుల్యతను కాపాడుతుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, సముద్రపు ఉప్పు కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Apr 25 , 2025 | 03:14 PM