Walking Tips: వాకింగ్ చేసే ముందు.. ఈ విషయాలను గుర్తుంచుకోకుంటే ప్రమాదంలో పడ్డట్లే..
ABN, Publish Date - Apr 29 , 2025 | 08:18 PM
ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండాలంటే తప్పనిసరిగా వాకింగ్ చేయాల్సిందే.

ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండాలంటే తప్పనిసరిగా వాకింగ్ చేయాల్సిందే. అయితే వాకింగ్ చేసే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

నడకకు ముందు కనీసం 3 నుంచి 5 నిముషాల పాటు వార్మప్ చేయాలి. చీలమండలను, కాలి వేళ్లను తాకడం, భుజాలను కదిలించడం, మెడ తిప్పడం వంటి పనులు చేయాలి.

నడవడానికి ముందు చాలా మంది టీ, కాఫీ ఎక్కువగా తీసుకుంటుంటారు. వాకింగ్ సమయంలో కెఫిన్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు

ఉదయం నిద్ర లేచిన సమయంలో శరీరంలో నీరు తక్కువగా ఉంటుంది. కాబట్టి వాకింగ్ చేయడానికి ముందు కనీసం రెండు గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి.

ఖాళీ కడుపుతో వాకింగ్ చేయం వల్ల తల తిరగడం, తలనొప్పి తదితర సమస్యలు తలెత్తవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాకింగ్ చేసే ముందు అల్పాహారం తీసుకోవాలి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Apr 29 , 2025 | 08:18 PM