Liver Health Tips: మీ కాలేయాన్ని పాడు చేసే ఆహారాలివే..
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:51 AM
మన శరీరంలో కాలేయం ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే కొన్ని ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.

మన శరీరంలో కాలేయం ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే కొన్ని ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్నాక్స్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.

మిఠాయిలు, పేస్ట్రీలు, ఫాస్ట్ ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంపై అదనపు ఒత్తిడి పడుతుంది.

మటన్, బీఫ్, సాసేజ్, బేకన్ వంటి ఎర్ర మాంసం ఉత్పత్తులు జీర్ణం కావడానికి చాలా కష్టం. ఇవి కాలేయంలో వాపు, కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి.

కేకులు, కుకీలు, శీతల పానీయాలతో పాటూ ప్యాక్ చేసిన జ్యూస్‌లలో ఫ్రక్టోజ్ అనే చక్కెర ఉంటుంది. ఇది కాలేయానికి చేరిన తర్వాత కొవ్వుగా మారుతుంది. ఈ కొవ్వు చివరకు సమస్యగా మారుతుంది.

ఐరన్, ప్రోటీన్, విటమిన్-ఎ అధిక మొత్తంలో ఆహారం కాలేయంపై ప్రభావం చూపిస్తుంది. కాలేయం పోషకాలను ఫిల్టర్ చేసే క్రమంలో ఎక్కువ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల సమస్య ఎదురవుతుంది.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యకరంగా ఉంటుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Jul 25 , 2025 | 11:51 AM