Health Tips: రాత్రి 7లోపు భోజనం చేస్తే.. శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా..
ABN, Publish Date - Jul 20 , 2025 | 12:17 PM
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తున్నారు. ప్రధానంగా భోజనం విషయంలో సమయ పాలన పాటించడం లేదు. ఆఫీసు టైమింగ్స్, పని ఒత్తిడి తదితర కారణాలతో కొందరు అర్ధరాత్రిళ్లు కూడా భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల..

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తున్నారు. ప్రధానంగా భోజనం విషయంలో సమయ పాలన పాటించడం లేదు. ఆఫీసు టైమింగ్స్, పని ఒత్తిడి తదితర కారణాలతో కొందరు అర్ధరాత్రిళ్లు కూడా భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే విషయం తెలిసిందే. అయితే రాత్రి 7 గంటల లోపు భోజనం చేసేస్తే.. శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు రాత్రి 7గంటల లోపు భోజనం చేస్తే.. నిద్రపోవడానికి ముందే మీ శరీరం జీర్ణ ప్రక్రియను పూర్తి చేస్తుంది. తద్వారా మీరరు త్వరగా నిద్రపోవడంతో పాటూ జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలగదు. అలాగే అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్, అపానవాయువు తదితర సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

త్వరగా భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ రోగులు విధిగా రాత్రి 7లోపు భోజనం చేయాలి. ఇలా చేయడం వల్ల టైప్-2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది.

రాత్రి 7లోపు భోజనం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. త్వరగా భోజనం చేసే వారిలో ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది.

రాత్రి త్వరగా భోజనం ముగించడం వల్ల శరీరం విశ్రాంత స్థితిలోకి వెళ్తుంది. తద్వారా మానసిక ఆరోగ్యంతో పాటూ ప్రశాంతమైన నిద్ర అలవరుతుంది.

రాత్రి 7 గంటల లోపు భోజనం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. ఆలస్యంగా భోజనం చేసే వారిలో రక్తంలో షుగర్ స్థాయి పెరగడంతో పాటూ ట్రైగ్లిజరైడ్‌లు పెరిగిపోతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

త్వరగా భోజనం ముగించడం వల్ల శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. తద్వారా మధుమేహం, ఒత్తిడి సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Jul 20 , 2025 | 12:17 PM