Brain Health: మీ బ్రెయిన్ బాగా పని చేయాలంటే.. ఈ 6 పనులు చేయండి చాలు..

ABN, Publish Date - Apr 21 , 2025 | 03:08 PM

ప్రస్తుత సమాజంలో చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, సరిపడా నిద్రలేకపోవడం తదితర సమస్యలతో సతమతమతున్నారు. తద్వారా ప్రధానంగా మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది.

Brain Health: మీ బ్రెయిన్ బాగా పని చేయాలంటే.. ఈ 6 పనులు చేయండి చాలు.. 1/7

ప్రస్తుత సమాజంలో చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, సరిపడా నిద్రలేకపోవడం తదితర సమస్యలతో సతమతమతున్నారు. తద్వారా ప్రధానంగా మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. మెదడు పనితీరు మెరుగుపరిచేందుకు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Brain Health: మీ బ్రెయిన్ బాగా పని చేయాలంటే.. ఈ 6 పనులు చేయండి చాలు.. 2/7

రోజూ 7నుంచి 8 గంటలు నిద్రపోవడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. నిద్రపోయే షెడ్యూల్‌‌‌ను క్రమం తప్పకుండా పటించడం వల్ల మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

Brain Health: మీ బ్రెయిన్ బాగా పని చేయాలంటే.. ఈ 6 పనులు చేయండి చాలు.. 3/7

తగినంత సమయం నిద్రపోవడంతో పాటూ వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ అందుతుంది. దీంతో మెదడు ఆరోగ్యం బాగుపడడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.

Brain Health: మీ బ్రెయిన్ బాగా పని చేయాలంటే.. ఈ 6 పనులు చేయండి చాలు.. 4/7

భోజనంలో చేపలు, గింజలు, ఆకుకూరలతో పాటూ తృణధాన్యాలు చేర్చడం వల్ల మెదడుకు పోషకాలు అందుతాయి.

Brain Health: మీ బ్రెయిన్ బాగా పని చేయాలంటే.. ఈ 6 పనులు చేయండి చాలు.. 5/7

సరైన నిద్ర, పోషకాహారంతో పాటూ తరచూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుండాలి. అలాగే పజిల్స్ పరిష్కరించడం తదితర పనులు చేయడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.

Brain Health: మీ బ్రెయిన్ బాగా పని చేయాలంటే.. ఈ 6 పనులు చేయండి చాలు.. 6/7

స్నేహితులు, కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, మానిసకోళ్లాసం కలుగుతుంది.

Brain Health: మీ బ్రెయిన్ బాగా పని చేయాలంటే.. ఈ 6 పనులు చేయండి చాలు.. 7/7

రోజూ కొంత సమయం ధ్యానం లేదా యోగా చేయడం వల్ల కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా మెడదు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Updated at - Apr 21 , 2025 | 03:08 PM