Kidney Health Tips: మీ కిడ్నీలు బాగుండాలంటే.. ఈ 6 ఆహారాలు తినడం ఇప్పుడే మానేయండి..
ABN, Publish Date - Apr 26 , 2025 | 04:21 PM
మనిషి శరీరంలోని ప్రధానమైన అవయవాల్లో మూత్ర పిండాలు ఒకటి. రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటూ వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటికి పంపిస్తాయి. మన ఆహార అలవాట్ల కారణంగా కొన్నిసార్లు కిడ్నీల పనితీరు తగ్గిపోతుంటుంది.

మనిషి శరీరంలోని ప్రధానమైన అవయవాల్లో మూత్ర పిండాలు ఒకటి. రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటూ వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటికి పంపిస్తాయి. మన ఆహార అలవాట్ల కారణంగా కొన్నిసార్లు కిడ్నీల పనితీరు తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా కిడ్నీలను దెబ్బతీసే 7 ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ముదురు రంగు శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. వీటిలో ఉండే భాస్వరం మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. కొన్నిసార్లు ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌కూ దారి తీయొచ్చు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఎక్కువగా తినకూడదు. ఇందులో అధికంగా ఉండే సోడియం, ప్రొటీన్.. మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతాయి. దీనివల్ల కాలక్రమేణా కిడ్నీల పనితీరు కూడా తగ్గిపోతుంది.

కిడ్నీలు బలహీనంగా ఉన్న వారు పాలు, పెరుగు, జున్ను వంటి వాటిని కూడా తక్కువగా తీసుకోవాలి. వీటిలోనూ భాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ ఖనిజాలు శరీరంలో పేరుకుపోయి మూత్రపిండాలకు నష్టం కలిగిస్తాయి.

కిడ్నీ సమస్యలు ఉన్న వారు నారింజ పండ్లు తినకపోవడమే మంచిది. ఇవీటిలోని అధిక పొటాషియం కిడ్నీలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.

హోల్ వీట్ బ్రెడ్ ఆరోగ్యకరమైనా కూడా ఇందులో ఎక్కువగా ఉండే ఫాస్పరస్, పొటాషియం కిడ్నీలకు హాని చేయొచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్న వారు వీటిని తీసుకోకపోవడం ఉత్తమం.

కిడ్నీ సమస్యలు ఉన్న వారు బంగాళాదుంపలు, చిలగడదుంపలకు దూరంగా ఉండాలి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మూత్రపిండాల పనితీరుకు ఆటకం కలుగుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Apr 26 , 2025 | 04:37 PM