Beauty Tips: రాత్రిళ్లు ముఖానికి చందనం రాసుకుని పడుకుంటే.. ఏమవుతుందో తెలుసా..
ABN, Publish Date - Jul 24 , 2025 | 10:45 AM
చందనం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ప్రధానంగా చందనం శరీరానికి బాగా పని చేస్తుంది.

చందనం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ప్రధానంగా చందనం శరీరానికి బాగా పని చేస్తుంది. ఒంట్లోని వేడిని పొగొట్టి చల్లబరుస్తుంది. అయితే రాత్రిళ్లు చందనాన్ని ముఖానికి రాసుకుని పడుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రిళ్లు చందనాన్ని ముఖానికి రాసుకుని పడుకోవడం వల్ల శరీరం చల్లబడడంతో పాటూ మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది.

ఆయుర్వేదం ప్రకారం నుదుటిపై చందనం రాసుకుంటే అజ్న చక్రం యాక్టివేట్ అవుతుందట. తద్వారా తల హీటెక్కడం తగ్గిపోయి మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది.

ముఖానికి చందనం రాసుకుని పడుకుంటే ప్రశాంత నిద్ర పడుతుంది. అలాగే ఈ వాసన పీల్చడం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. నిద్రలేమితో బాధపడే వారికి ఇది బాగా పని చేస్తుంది.

శరీరంలో వాతం ఎక్కువై ఇబ్బంది పడే వారికి చందనం బాగా పని చేస్తుంది. అలాగే ఆందోళన ఉన్నా చందనం రాసుకోగానే తగ్గిపోయి కంటి నిండా నిద్ర పడుతుంది.

రాత్రిళ్లు రోజూ చందనం రాసుకోవడం వల్ల.. శరీరం దానికి అలవాటు పడి ఆ సమయానికి ఆటోమేటిక్‌గా నిద్ర వచ్చేస్తుంది. దీనివల్ల స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. ఎలాంటి నిద్రమాత్రల అవసరం లేకుండానే నిద్ర పడుతుంది.

కళ్ల కింద నల్లటి వలయాలకు కూడా చందనం బాగా పని చేస్తుంది. కళ్ల కంద చందనం రాసుకోవడం వల్ల అక్కడ సెల్స్ యాక్టివ్ అవడంతో పాటూ హైడ్రేట్ అవుతాయి. దీనివల్ల నల్లటి వలయాలు తగ్గడంతో పాటూ ముడతలు కూడా తగ్గిపోతాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Jul 24 , 2025 | 10:45 AM