Brahma Kamal: కను విందు చేస్తున్న బ్రహ్మ కమలాలు..

ABN, Publish Date - Jul 28 , 2025 | 05:59 PM

బ్రహ్మ కమలం.. పవిత్రమైన పుష్పం. హిందువులకు ఈ పుష్పం ఎంతో పరమ పవిత్రం. అలాంటి బ్రహ్మ కమలం మొక్కకు ఏకంగా 70 పువ్వులు పూసాయి. ఏడాదికి ఒక సారి.. అది కూడా రాత్రి సమయంలో మాత్రమే ఈ పువ్వు పూస్తుంది.

Brahma Kamal: కను విందు చేస్తున్న బ్రహ్మ కమలాలు.. 1/11

బ్రహ్మ కమలం.. పవిత్రమైన పుష్పం. హిందువులకు ఈ పుష్పం ఎంతో పరమ పవిత్రం. అలాంటి బ్రహ్మ కమలం మొక్కకు ఏకంగా 70 పువ్వులు పూసాయి.

Brahma Kamal: కను విందు చేస్తున్న బ్రహ్మ కమలాలు.. 2/11

ఏడాదికి ఒక సారి.. అది కూడా రాత్రి సమయంలో మాత్రమే ఈ పువ్వు పూస్తుంది.

Brahma Kamal: కను విందు చేస్తున్న బ్రహ్మ కమలాలు.. 3/11

అలాంటి అరుదైన దృశ్యం ఇది. ఒకే సారి 70 పుష్పాలతో ఈ బ్రహ్మ కమలం కను విందు చేసింది.

Brahma Kamal: కను విందు చేస్తున్న బ్రహ్మ కమలాలు.. 4/11

బ్రహ్మ కమలాన్ని ఎపిఫీల్లమ్‌ ఆక్సీపెటాలమ్‌ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఈ మొక్కలు అధికంగా హిమాలయ, ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

Brahma Kamal: కను విందు చేస్తున్న బ్రహ్మ కమలాలు.. 5/11

కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు తోటలు, ఇళ్లలో సైతం కుండీల్లో ఈ మొక్కలను పెంచుతున్నారు.

Brahma Kamal: కను విందు చేస్తున్న బ్రహ్మ కమలాలు.. 6/11

రాత్రి వేళల్లో చంద్రుడు వెలుగులు విరజిమ్మిన తర్వాత ఈ బ్రహ్మ కమలం పుష్పం వికసించి.. కేవలం కొన్ని గంటలు మాత్రమే నిలుస్తోంది. మళ్లీ సూర్యోదయానికి వాడిపోతుంది. ఈ పువ్వు చాలా సేపు సువాసనలు వెదజల్లుతుంది.

Brahma Kamal: కను విందు చేస్తున్న బ్రహ్మ కమలాలు.. 7/11

అందుకే ఈ పువ్వును క్వీన్ ఆఫ్‌ నైట్‌ అని అభివర్ణిస్తారు. రాత్రి ఈ పువ్వు పూర్తిగా వికసించిన తర్వాత.. ఫ్రిడ్జ్‌లో పెడితే వాడిపోకుండా ఉంటుందంటారు.

Brahma Kamal: కను విందు చేస్తున్న బ్రహ్మ కమలాలు.. 8/11

బ్రహ్మ కమలం పువ్వును హిందూ మతంలో పరమ పవిత్రంగా భావిస్తారు. సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఈ పువ్వు అత్యంత ప్రీతికరమైనదని శాస్త్రాలు చెబుతాయి.

Brahma Kamal: కను విందు చేస్తున్న బ్రహ్మ కమలాలు.. 9/11

కొన్ని ప్రాంతాల్లో ఈ పుష్పాన్ని చూడగానే కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు.

Brahma Kamal: కను విందు చేస్తున్న బ్రహ్మ కమలాలు.. 10/11

ఈ పువ్వు వికసించే సమయంలో చూసి.. చాలా మంది దీపాలు వెలిగించి.. ప్రార్థనలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఈ బ్రహ్మ కమలం.. అన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నా.. ఒకే ఇంట్లో 70కిపైగా పువ్వులు పూయడం.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Brahma Kamal: కను విందు చేస్తున్న బ్రహ్మ కమలాలు.. 11/11

ఈ మొక్కలు కేవలం అందాన్ని మాత్రమే కాకుండా.. ఆధ్యాత్మిక భావనను కలిగిస్తాయి. అలాంటి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆ ప్రాంతం అంతా పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుందంటున్నారు.

Updated at - Jul 28 , 2025 | 06:12 PM