CM Chandrababu: ‘ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jul 16 , 2025 | 07:46 AM

ఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియంలో జరిగిన ‘ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీలో పీవీ నరసింహారావు జీవితం, వారసత్వం అనే అంశంపై జరిగిన సమావేశంలో పాల్గొని నివాళులు అర్పించానని తెలిపారు. పీవీ గురించి తన ఉపన్యాసం ఇవ్వడం ఒక అదృష్టమని చెప్పుకొచ్చారు. ఇది భారతదేశంలోని అత్యుత్తమ మ్యూజియంలలో ఒకటని అభివర్ణించారు. పీవీకి గొప్ప నివాళిని అర్పిస్తూ మ్యూజియాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు. తెలుగు బిడ్డ, భారతమాత అంకితభావం కలిగిన పీవీ నరసింహారావు పలు సవాళ్లను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపించారని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. పీవీ అద్భుతమైన రాజనీతిజ్ఞత, రాజకీయ చతురత, సంక్షోభ సమయాల్లో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని నొక్కిచెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడమే కాకుండా, తన సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశం విధిని కూడా పునర్నిర్మించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

CM Chandrababu: ‘ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 1/5

ఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియంలో జరిగిన ‘ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

CM Chandrababu: ‘ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 2/5

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీలో పీవీ నరసింహారావు జీవితం, వారసత్వం అనే అంశంపై జరిగిన సమావేశంలో పాల్గొని నివాళులు అర్పించానని తెలిపారు.

CM Chandrababu: ‘ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 3/5

పీవీ గురించి తన ఉపన్యాసం ఇవ్వడం ఒక అదృష్టమని చెప్పుకొచ్చారు. ఇది భారతదేశంలోని అత్యుత్తమ మ్యూజియంలలో ఒకటని అభివర్ణించారు సీఎం చంద్రబాబు.

CM Chandrababu: ‘ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 4/5

పీవీకి గొప్ప నివాళిని అర్పిస్తూ మ్యూజియాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు. తెలుగు బిడ్డ, భారతమాత అంకితభావం కలిగిన పీవీ నరసింహారావు పలు సవాళ్లను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపించారని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

CM Chandrababu: ‘ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 5/5

పీవీ నరసింహారావు అద్భుతమైన రాజనీతిజ్ఞత, రాజకీయ చతురత, సంక్షోభ సమయాల్లో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated at - Jul 16 , 2025 | 07:47 AM