Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Jul 29 , 2025 | 07:43 PM

నాగ పంచమి నేపథ్యంలో మంగళవారం నాగేంద్రస్వామి వారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 1/12

శ్రావణమాసంలో వచ్చే తొలి పండగ నాగ పంచమి. ఇది జులై 29వ తేదీ.. అంటే మంగళవారం ఈ రోజు వచ్చింది.

Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 2/12

ఈ నేపథ్యంలో శ్రీవల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (కుమారస్వామి) వారి దేవాలయాలకు భక్తిలు పోటెత్తారు.

Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 3/12

అదీకాక మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు ఆరాధిస్తారు.

Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 4/12

దీంతో మంగళవారం నాగపంచమి కూడా కావడంతో.. ఆ స్వామి వారిని పూజించేందుకు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు.

Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 5/12

ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నాగేంద్ర స్వామి వారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 6/12

నాగుల పంచమి సందర్భంగా హైదరాబాద్‌ వెంగళరావు నగర్‌లోని నాగదేవతల దేవాలయానికి భారీగా భక్తుల తరలి వచ్చారు.

Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 7/12

అలాగే కంటోన్మెంట్ ప్రాంతం లాల్ బజార్‌లోని నాగదేవత దేవాలయం వద్ద మహిళలు పాలతో అభిషేకం చేశారు.

Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 8/12

ఇక కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం, షాపూర్ నగర్, ఐడీపీఎల్ పరిధిలోని దేవాలయాల్లో నాగేంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 9/12

ఏపీలోని అనంతపురంలో నాగుల పంచమి సందర్భంగా పుట్టల్లో పాలు పోసేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులు.

Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 10/12

దేవాలయాల్లోని రావి చెట్టు కింద నాగ ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 11/12

రావి చెట్టు కింద నాగ ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. ప్రదక్షణలు చేశారు.

Nag Panchami: నాగ పంచమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 12/12

దేవాలయాల్లోని నాగ ప్రతిమలకు పాలు పోసి.. పసుపు, కుంకుమలు చల్లి, ప్రసాదం నైవేద్యంగా పెట్టి దణ్ణం పెట్టిన భక్తులు

Updated at - Jul 29 , 2025 | 07:46 PM