భారీ వర్షాలు.. సముద్రంలోకి చేరుతున్న వరద నీరు
ABN, Publish Date - Jul 24 , 2025 | 09:14 PM
ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరంతా సముద్రంలోకి చేరుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పరిస్థితి ఇలా ఉంది.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేసిన గోదావరి వరద నీరు.

ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణం నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ నీటిని కిందకి వదిలారు.

దవళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటిని సముద్రంలోకి వదిలారు.

కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రపు అలలు ఉద్రిక్తంగా మారాయి. అవి తీరంలోని ఇళ్లలోకి ప్రవేశించాయి.

తీరాన్ని తాకుతోన్న సముద్రపు ఆలలు.

తీరానికి పోటెత్తుతోన్న ఆలలు.

కడప జిల్లాలో పెన్నా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

కర్ణాటక నుంచి భారీగా వరద నీరు ఈ నదిలో ప్రవేశిస్తోంది.

నదికి భారీగా వరద నీరు పోటెత్తింది.

పెన్నా నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో నది ఉధృతిగా ప్రవహిస్తోంది.
Updated at - Jul 24 , 2025 | 09:26 PM