ఆనంద గజపతి రాజు జీవిత విశేషాలపై పుస్తక ఆవిష్కరణ.. పాల్గొన్న అశోక్ గజపతి రాజు
ABN, Publish Date - Jul 23 , 2025 | 07:39 AM
స్వర్గీయ పూసపాటి ఆనంద గజపతి రాజు 75వ జయంతిని పురస్కరించుకొని, ఆయన జీవిత విశేషాలను సమగ్రంగా పరిచయం చేసే బయోగ్రఫీ పుస్తకాన్ని వారి కుమార్తె ఊర్మిళ గజపతి రాజు రచించారు. ఈ పుస్తకాన్ని మంగళవారం విశాఖపట్నం గ్రాండ్ బే హోటల్ నందు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన సోదరుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రదీప్ చంద్రదేవ్, భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావుతోపాటు పూసపాటి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఆనంద గజపతి రాజు స్మరణకు అంకితంగా వెలువడిన ఈ గ్రంథం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని అశోక్ గజపతి రాజు ఉద్ఘాటించారు.

స్వర్గీయ పూసపాటి ఆనంద గజపతి రాజు 75వ జయంతిని పురస్కరించుకొని, ఆయన జీవిత విశేషాలను సమగ్రంగా పరిచయం చేసే బయోగ్రఫీ పుస్తకాన్ని వారి కుమార్తె ఊర్మిళ గజపతి రాజు రచించారు.

ఈ పుస్తకాన్ని మంగళవారం విశాఖపట్నం గ్రాండ్ బే హోటల్ నందు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన సోదరుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రదీప్ చంద్రదేవ్, భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావుతోపాటు పూసపాటి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఆనంద గజపతి రాజు స్మరణకు అంకితంగా వెలువడిన ఈ గ్రంథం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని అశోక్ గజపతి రాజు ఉద్ఘాటించారు.

ఎన్టీ రామారావు కేబినెట్‌లో మొదటి విద్యా శాఖ మంత్రిగా ఆనంద గజపతి రాజు పని చేశారని గుర్తు చేశారు.

తమ వంశానికి చెందిన రాజులకోటలను విద్యా సంస్థలకు ఇచ్చామని తెలిపారు అశోక్ గజపతి రాజు.

అయితే తాను ఇప్పటి వరకు తూర్పున ఉన్నానని.. ప్రస్తుతం వెస్ట్ కోస్ట్ వైపు ఉన్న గోవా వెళ్తున్నానని చెప్పుకొచ్చారు అశోక్ గజపతి రాజు.

అందరూ ధర్మాన్ని పాటించాలని తాను కోరుతున్నానని అన్నారు. తమ కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు ఈ సందర్భంగా అందరికీ అశోక్ గజపతి రాజు ధన్యవాదాలు తెలిపారు.

ఆనంద గజపతి నిత్యం ధర్మాన్ని పాటించే వారని పేర్కొన్నారు.
Updated at - Jul 23 , 2025 | 07:53 AM