విజయవాడలో 'మైండ్ సెట్ షిఫ్ట్' పుస్తకావిష్కరణలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Apr 25 , 2025 | 07:26 AM
విజయవాడలో గురువారం నాడు మంత్రి నారాయణ చిన్న కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

విజయవాడలో గురువారం నాడు మంత్రి నారాయణ చిన్న కుమార్తె శరణి రచించిన 'మైండ్ సెట్ షిఫ్ట్' పుస్తకావిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మెగాస్టార్ చిరంజీవి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం చంద్రబాబు

కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

'మైండ్ సెట్ షిఫ్ట్' మొదటి పుస్తకాన్ని చిరంజీవికి సీఎం చంద్రబాబు అందించారు.

రాజకీయాల్లో చంద్రబాబు, సినిమాల్లో తాను రాణించామంటే పాజిటివ్ ఆలోచన..మన మైండ్‌సెట్ కారణమని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

వివిధ ప్రాంతాల్లో నారాయణ కుమార్తె శరణి పర్యటించి, పలువురు వ్యక్తులను పరిశీలించి 'మైండ్ సెట్ షిఫ్ట్' పుస్తకాన్ని రచించారు.

మైండ్‌సెట్ అనేది ప్రతి మనిషిలో కీలకంగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పాజిటివ్‌గా ఆలోచన చేయాలని ఎం చంద్రబాబు సూచించారు.

శరణి చిన్న వయసులోనే పాజిటివ్‌గా ఉండబట్టే ఈరోజు ఇలా నిలబడ్డారని సీఎం చంద్రబాబు అన్నారు.

నారాయణ విద్యా సంస్థలు ఒక బ్రాండ్ అని.. ఆర్డినరీ స్టూడెంట్‌లను ఎక్స్‌ట్రా ఆర్డినరీగా మారుస్తారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
Updated at - Apr 25 , 2025 | 07:39 AM