CM Chandrababu: ఢిల్లీలో కేంద్రమంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
ABN, Publish Date - Apr 23 , 2025 | 08:28 AM
విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్ర ప్రాజెక్టులు, పథకాల గురించి చర్చించారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబుకు అమిత్ షా, కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో మంగళవారం నాడు సీఎం చంద్రబాబు భేటీ అయి రాష్ట్ర ప్రాజెక్టులు, పథకాల గురించి చర్చించారు.

కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్ , పీయూష్ గోయల్‌లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పీయూష్ గోయల్‌ను సన్మానిస్తున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్లమెంటరీ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ పార్లమెంట్ సభ్యులు, తదితరులు ఉన్నారు.

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో ఏపీ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడారు.
Updated at - Apr 23 , 2025 | 08:45 AM