Share News

TANA: 85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు..

ABN , Publish Date - Apr 25 , 2025 | 08:32 PM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహించే నెలనెల తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా 79వ ఇంటర్నేషనల్ జూమ్ మీటింగ్ ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం

TANA: 85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు..
TANA

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహించే నెలనెల తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా 79వ ఇంటర్నేషనల్ జూమ్ మీటింగ్ ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈనెల ‘రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల స్మృతిలో’, ‘85 వసంతాల ‘ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు’ అంశంపై నెలనెల తెలుగు వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహకులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని కోరారు. మరిన్ని వివరాల కోసం www.tana.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.


ఏప్రిల్‌ నెలలో నిర్వహించే తెలుగు వెలుగు కార్యక్రమంలో రేడియో హీరోయిన్‌, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి శారదా శ్రీనివాసన్‌, అవనిగడ్డ ఎమ్మెల్యే, రేడియో అన్నయ్య, అక్కయ్యలతో ప్రత్యక్ష పరిచయం ఉన్న డాక్టర్‌ మండలి బుద్ధప్రసాద్‌, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల నిరంతర ప్రోత్సహకులు పద్మభూషణ్‌ డాక్టర్‌ కెఐ వరప్రసాదరెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పూర్వ ప్రధానకార్యదర్శి, బాలానంద పూర్వ సభ్యులు డాక్టర్‌ మోహన్‌ కందా, రేడియో అన్నయ్య మేనకోడలు, బాలానంద పూర్వసభ్యులు, ఆంధ్ర బాలనంద సంఘం అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి, ఆకాశవాణి పూర్వ సంగీత కార్యక్రమ నిర్వహణాధికారి, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు కలగా కృష్ణమోహన్‌, ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి, బాలానందం పూర్వసభ్‌యులు సుధామ పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు.


విశిష్ట అతిధులుగా బాలానందం పూర్వ సభ్యులు, విశ్రాంత ఇంజినీర్‌ ఎన్‌వి.అశోక్‌, బాలానందం పూర్వ సభ్యురాలు, విశ్రాంత బ్యాంకు అధికారి రావులపర్తి రాజేశ్వరి, బాలానందం పూర్వ సభ్యురాలు, విశ్రాంత ఉపాధ్యాయిని నండూరి సీతా సాయిరాం, బాలానందం నృత్య దర్శకులు మాడభూషి బద్రినాథ్‌, బాలానందం కార్యవర్గ సభ్యురాలు ఆవుల హరిత, బాలానందం గాయక బృందం, శిక్షణా విభాగపు కార్యవర్గ సభ్యురాలు చినముత్తేవి కరుణ, బాలానందం సంగీత, నృత్య కళాకారిణి మాలెంపాటి నవ్య, బాలానందం గాయకబృందం శిక్షణా విభాగపు కార్యవర్గ సభ్యులు గోవిందు దేవరాజ పాల్గొంటారు.

Updated Date - Apr 25 , 2025 | 08:32 PM