Home » Pravasa
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌న, రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లను గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్, తెలుగు సంఘాల ఐఖ్య వేదిక అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు కలిశారు. తిరుపతి ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహించే నెలనెల తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా 79వ ఇంటర్నేషనల్ జూమ్ మీటింగ్ ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం
NRI, TANTEX : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదికగా 'నెల నెలా తెలుగు వెన్నెల' 210వ సాహిత్య సదస్సు జనవరి 19వ తేదీన డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. ''సాహిత్య అద్భుత వర్ణనలు - వర్ణించ తరమా'' అంశంపై వక్తలు మాట్లాడారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఫౌండేషన్‌లో భారీ స్కాం వెలుగు చూసింది. ఈ ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు.. భారీగా నిధులను తన సొంత కంపెనీకి మళ్లించినట్లు తానాలోని పెద్దలు గుర్తించారు.
హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నాంటాయి. ఓకే చోటకు మహిళలంతా చేరి బతుకమ్మ ఆడారు. తర్వాత అందరూ కలిసి విందు భోజనం ఆరగించారు. ప్రతీ ఏటా బతుకమ్మ, దసరా పండగలను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు.
2025 తానా (TANA) మహాసభల సమన్వయకర్త నియామక ప్రక్రియ చెల్లదని ప్రస్తుత తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తానా సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఈ మేరకు బోర్డు ఛైర్మన్ డా. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్, తానా కార్యదర్శి కసుకుర్తి రాజాలకు నోటీసులు పంపించారు.
ఎడారి దేశంలో కన్న తండ్రి కన్నుమూస్తే కడసారి చూడడానికి ఆ దేశంలో ఉన్న కొడుకు చూడలేని పరిస్థితి. భుజాల మీద మోసి, పెద్ద చేసిన తండ్రికి కడసారి వీడ్కోలు పలుకలేపోయాడు. ఎలాగోలా ధైర్యం చేసి వచ్చేసిన ఆ కుమారుడికి నిరాశే మిగిలింది. 900 కిలో మీటర్ల దూరం వచ్చేసరికి కన్న తండ్రి మృతదేహం మాతృదేశానికి వెళ్ళిందని తెలిసి కన్నీరు మున్నీరయ్యాడు.
ఉపాధి కోసం అరబ్ దేశానికి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళకు సాయం అందింది. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం తుర్కపల్లె గ్రామానికి చెందిన షేక్ హసీనా అనే యువతి గల్ఫ్ దేశంలో సాయం కోసం చూసింది. తనను రక్షించాలని మంత్రి నారా లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. లోకేష్ పిలుపు మేరకు సౌదీ అరేబియాలో ఏపీ ఎన్ఆర్ఐ ప్రతినిధి స్పందించారు.
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా.. ఆదివారం నిర్వహించిన 66వ సాహిత్య సమావేశం ‘‘మన ప్రాచీన భారతీయ సాహిత్యం.. ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే కార్యక్రమం ఘనంగా, విజ్ఞానదాయకంగా జరిగింది.
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) వార్షికోత్సవాన్ని రక్తదాన శిబిరంతో ప్రారంభించాయి. టీపీఏడీ ఏర్పడినప్పటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. గత మూడేళ్ల నుంచి ఏడాదికి రెండుసార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది 13వ రక్తదాన శిబిరం అని నిర్వహకులు తెలిపారు.