Murshidabad Violence: రాష్ట్రం తగులబడుతుంటే ఆ ఎంపీ ఏమైనట్టు?
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:47 PM
హింసాకాండ చెలరేగిన ముర్షీదాబాద్ జిల్లాలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. జాంగిపూర్, ముర్షీదాబాద్, బహ్రాంపూర్. మూడు నియోజకవర్గాలకు టీఎంసీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాంగిపూర్‌కు ఖలీలుర్ రెహమాన్, ముర్షీదాబాద్‌కు తహెర్ ఖాన్, బహ్రాంపూర్‌కు యూసఫ్ పఠాన్ ఎంపీలుగా ఉన్నారు.

కోల్‌కతా: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్ (Murshidabad)లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో కూల్‌గా ఛాయ్ తాగుతూ పోస్టింగ్‌లు పెట్టిన టీఎంసీ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan) ఇటీవల అందరి ఆగ్రహాన్ని చవిచూశారు. ఘర్షణల ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించి ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ బహ్రాంపూర్ ఎంపీ ఒక్కమాట మాట్లాడకపోవడం, అసలు ఆయన ఆచూకీ కూడా లేకపోవడంతో విపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ టీఎంసీ నేతల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Encounter: అడవుల్లో కాల్పుల మోత.. మావోలు హతం
హింసాకాండ చెలరేగిన ముర్షీదాబాద్ జిల్లాలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. జాంగిపూర్, ముర్షీదాబాద్, బహ్రాంపూర్. మూడు నియోజకవర్గాలకు టీఎంసీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాంగిపూర్‌కు ఖలీలుర్ రెహమాన్, ముర్షీదాబాద్‌కు తహెర్ ఖాన్, బహ్రాంపూర్‌కు యూసఫ్ పఠాన్ ఎంపీలుగా ఉన్నారు. ఏప్రిల్ 11న హింసాకాండ చెలరేగగా జాంగిపూర్ నియోజకవర్గంలోని సుతి, సంషేర్‌గంజ్, ధులియాన్ ప్రాంతాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. యూసుఫ్ పఠాన్ నియోజకవర్గంపై నేరుగా ఎలాంటి ప్రభావం లేనప్పటికీ అల్లర్లు చెలరేగిన ప్రాంతాలకు ఆయన నియోజకవర్గం ఎంతో దూరంలో లేదు. ఈ నేపథ్యంలో పఠాన్ కనిపించకపోవడంతో విపక్షాలతో పాటు టీఎంసీలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముర్షీదాబాద్ హింసాకాండకు సంబంధించి ఇంతవరకూ 270 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
తప్పుడు సంకేతాలు: టీఎంసీ
హింసాత్మక ఘటనల క్రమంలో యూసఫ్ పఠాన్ ముఖం చాటువేయడంపై ముర్షీదాబాద్ ఎంపీ అబు తహెర్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందువల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ''ఆయన బయట వ్యక్తి. రాజకీయాలకు కొత్త. ఇప్పటివరకూ ఆయన దూరంగానే ఉంటూ వచ్చారు. ఇందువల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్ వర్కర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు'' అని తహెర్ ఖాన్ చెప్పారు. సంషేర్ గంజ్‌లో శాంతి సమావేశం ఏర్పాటు చేస్తే 100 కిలోమీటర్ల ప్రయాణించి తాను అక్కడకు వెళ్లానని, ఖలిలూర్ రెహ్మాన్, పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు హాజరయ్యారని, కానీ పఠాన్ గెర్హాజరయ్యారని తెలిపారు. ఇది నా ప్రాంతం కాదు, నా ప్రజలు కాదు అని ఎవరూ భావించకూడదని పరోక్షంగా పఠాన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నా ఇష్టం నాదన్నట్టు వ్యవహరించ కూడదని టీఎంసీ మరో నేత, భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ అన్నారు. పఠాన్ గుజరాత్‌కు చెందిన క్రికెటర్ అని, లోక్‌సభ ఎన్నికల్లో అధీర్ రంజన్‌ను ఓడించారని, ఇప్పుడు ప్రజలతోనే గేమ్స్ అడుతున్నారని విమర్శించారు. పఠాన్ చివరిసారిగా తన నియోజకవర్గంలో కొన్ని ఇఫ్తార్ విందుల్లో కనిపించారు.
ఇవి కూడా చదవండి..