Sachin Raghuvanshi: రాజా రఘవంశీ సోదరుడే నా కొడుక్కి తండ్రి.. ఓ మహిళ సంచలన అభియోగం
ABN , Publish Date - Aug 03 , 2025 | 09:04 PM
సచిన్ పద్ధతిగా పెళ్లి చేసుకుని వివాహ బంధాన్ని గుర్తించి ఉంటే తాము ఇంత అవమానాలకు గురయ్యే వాళ్లము కాదని, దీనిపై తాను కోర్టుకు కూడా వెళ్లానని ఆమె చెప్పింది. న్యాయం కోసం అడిగిన ప్రతిసారి సచిన్ కుటుంబం ముఖం చేటేసేదని, అవమానించేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇండోర్: హనీమూన్ మర్డర్ కేసు (Honeymoon murder case) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో వార్తల్లో ప్రముఖంగా చోటుచేసుకున్న రాజా రఘవంశీ కుటుంబం తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. రాజా రఘువంశీ (Raja Raghuvanshi) సోదరుడు సచిన్ రఘువంశీ (Sachin Raghuvanshi) తన భర్త అని, తమకు ఏడాదిన్నర పిల్లవాడు కూడా ఉన్నాడని ఒక మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందుకు ఆధారంగా డీఎన్ఏ రిపోర్ట్‌ను కూడా చూపించింది. ఈనెల 1వ తేదీన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయం వెల్లడించింది. రాజా రఘవంశీ హత్య కేసు సంచలనమైన క్రమంలో ఆ కుటుంబానికి సంబంధించిన మరో కోణం వెలుగులోకి రావడం ఆసక్తికరంగా మారుతోంది.
'నా బిడ్డను దారుణంగా నిరాకరించారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదు, నా బిడ్డకు కూడా' అని ఆ మహిళ భావోద్వేగానికి గురైంది. సచిన్ తనను సంప్రదాయబద్ధంగా గుడిలో పెళ్లి చేసుకున్నాడని, అందుకు సంబంధించిన వీడియో, ఫోటోగ్రాఫ్‌లు తన వద్ద ఉన్నాయని ఆమె తెలిపింది. మీడియాకు వాటిని చూపించింది. డీన్ఏ పరీక్షలో కూడా తన కుమారుడికి సచిన్ తండ్రి అని స్పష్టంగా తేలిందని పేర్కొంది.
సచిన్ పద్ధతిగా పెళ్లి చేసుకుని వివాహ బంధాన్ని గుర్తించి ఉంటే తాము ఇంత అవమానాలకు గురయ్యే వాళ్లము కాదని, దీనిపై తాను కోర్టుకు కూడా వెళ్లానని ఆమె చెప్పింది. న్యాయం కోసం అడిగిన ప్రతిసారి సచిన్ కుటుంబం ముఖం చేటేసేదని, అవమానించేదని ఆవేదన వ్యక్తం చేసింది. బాబు పెరుగుతున్నాడని, ఇప్పడు అతనికి ఏమి సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. కోర్టులో తనకు న్యాయం జరిగి చట్టపరమైన హక్కులు లభిస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపింది.
రాజారఘువంశీ అనుమానాస్పద హత్య అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఇన్వెస్టిగేటర్లు విచారించారు. తాజాగా సచిన్ రఘువంశీపై ఒక మహిళ ఆరోపణలు చేయడం ఆ కుటుంబ ప్రవర్తనపై సరికొత్త అనుమానాలకు తావిస్తోంది.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో ఎస్ఐఆర్ మొదలే కాలేదు, ఓటర్లు ఎలా పెరిగారు?.. చిదంబరం వ్యాఖ్యలపై ఈసీ
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి