Share News

Lab Leak: వూహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా: వైట్‌హౌస్‌

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:20 AM

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ వైరస్‌ మొదటిసారి చైనాలోని వూహాన్‌ నగరంలో కనిపించినప్పుడు.. దాని మూలం గురించి చర్చ మొదలైంది. ఈ వైరస్‌ సహజంగా వ్యాప్తి చెందిందా.. లేదా ప్రయోగశాల నుంచి లీక్‌ అయిందా..? అనే ప్రశ్నలు అనేకసార్లు వెల్లువెత్తాయి.

Lab Leak: వూహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా: వైట్‌హౌస్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ వైరస్‌ మొదటిసారి చైనాలోని వూహాన్‌ నగరంలో కనిపించినప్పుడు.. దాని మూలం గురించి చర్చ మొదలైంది. ఈ వైరస్‌ సహజంగా వ్యాప్తి చెందిందా.. లేదా ప్రయోగశాల నుంచి లీక్‌ అయిందా..? అనే ప్రశ్నలు అనేకసార్లు వెల్లువెత్తాయి. తాజాగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ మరోసారి ఈ చర్చకు ఆజ్యం పోసింది. దాని వెబ్‌సైట్‌లో కొత్త పేజీని ప్రారంభించడం ద్వారా.. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తికి చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌నే మూలమని అభివర్ణించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అలెర్జీ, ఇన్ఫెక్టియస్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐఏఐడీ) డైరక్టర్‌ డాక్టర్‌ ఆంటోనీ ఫౌసీ ఈ నిజాన్ని దాచేందుకు ప్రయత్నించారని ఆరోపించింది.


దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిపై మరోసారి చర్చ తీవ్రమైంది. ట్రంప్‌ సర్కారు కొవిడ్‌.జీవోవీ వెబ్‌సైట్‌లో ‘‘ల్యాబ్‌ లీక్‌: ద ట్రు ఆరిజన్స్‌ ఆఫ్‌ కొవిడ్‌-19’’ అనే శీర్షికతో కొత్త పేజీని జోడించింది. డాక్టర్‌ ఫౌసీ, బైడెన్‌ నేతృత్వంలోని గత ప్రభుత్వం కరోనా వైరస్‌ మూలానికి సంబంధించిన సమాచారాన్ని దాచడానికి ప్రయత్నించిందని, దీనివల్ల చాలా ఏళ్లపాటు గందరగోళం నెలకొందని ఆ పేజీలో పేర్కొంది. కొవిడ్‌-19 నిజంగా ఎక్కడ ప్రారంభమైందో తెలియకుండా ఉండేందుకు డెమోక్రాట్‌ నాయకులు, మీడియా.. ల్యాబ్‌ లీక్‌ సిద్ధాంతాలను తప్పు అని నిరూపించడానికి ఎలా ప్రయత్నించారో ఈ వెబ్‌సైట్‌ వెల్లడిస్తుందని వైట్‌హౌస్‌ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

Thackeray Cousins Renuion: మళ్లీ కలవడం కష్టమేమీ కాదు.. సంకేతాలిచ్చిన థాకరే సోదరులు

PM Modi: సౌదీ అరేబియాలో మోదీ రెండ్రోజుల పర్యటన

Delhi Men's Satyagraha : భార్యలకేనా హక్కులు.. భర్తలకు లేవా.. దయచేసి మగాళ్లకూ రక్షణ కల్పించండి..

Updated Date - Apr 20 , 2025 | 04:21 AM