Share News

WhatsApp: లక్షలాది భారతీయుల ఖాతాలపై కీలక నిర్ణయం

ABN , Publish Date - Aug 04 , 2025 | 03:20 PM

ఈ ఏడాది ప్రారంభంలో కోటి మంది ఖాతాలను నిలిపి వేసి వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా వాట్సప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

WhatsApp: లక్షలాది భారతీయుల ఖాతాలపై కీలక నిర్ణయం
WhatsApp

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో 98 లక్షల ఖాతాలను నిలిపి వేసినట్లు వాట్సాప్ సంస్థ వెల్లడించింది. జూన్ మాసం ఒక్క నెలలోనే ఈ ఖాతాలను నిలిపి వేసినట్లు తెలిపింది. జూన్ నెల వారీ నివేదికపై సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. దుర్వినియోగం, హనికరమైన ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.


అదే సమయంలో వచ్చిన ఫిర్యాదులపై సైతం ఈ సంస్థ స్పందించింది. వాట్సప్‌ వేదికగా చేసుకుని.. దానిని దుర్వినియోగం చేస్తుందనే విషయాన్ని గుర్తించినట్లు చెప్పింది. ఇక భారత్‌లోని వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులను సైతం పరిష్కరించినట్లు ఈ సంస్థ తెలిపింది. జూన్ మాసంలో 23,596 ఫిర్యాదులు అందాయని.. వాటిలో 1,001 ఖాతాపై చర్యలు తీసుకున్నట్లు చెప్పింది.


అయితే అందిన ఫిర్యాదుల్లో కొన్ని బ్యాన్ అప్పీళ్లకు లింక్ చేయబడ్డాయని.. ఫలితంగా 756 ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ తరహా చర్యలను ఎప్పుడో ఆపడం కంటే.. ప్రారంభంలోనే నిలిపి వేయడం మంచిదని వాట్సప్ అభిప్రాయపడింది.


ఈ చర్యలను మూడు స్థాయిల్లో నిలిపి వేయ వచ్చని సూచించింది. ఖాతా సెటప్ సమయంలో.. సందేశం పంపేటప్పుడు.. ప్రతికూల అభిప్రాయంపై ప్రతిస్పందన తదితర మూడు కీలక దశలలో దీని దుర్వినియోగాన్ని గుర్తించ వచ్చని వాట్సప్ సోదాహరణగా వివరించింది. ఇక రిజిస్ట్రేషన్, సందేశాలు పంపే సమయం, ఫిర్యాదులు ఆధారంగా స్పందిస్తామని పేర్కొంది.


మరోవైపు ఈ ఏడాది జనవరి.. ఒక్క నెలలోనే దాదాపు 99 లక్షల (10 మిలియన్లు) భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క నెలలోనే భారీ స్థాయిలో అకౌంట్లను ఈ సంస్థ తొలగించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్

రఘురామ కేసులో మరో కీలక పరిణామం

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 04:00 PM