Share News

Lalu Prasad: తేజస్వికి త్వరలో పూర్తి బాధ్యతలు: లాలూ

ABN , Publish Date - Jul 05 , 2025 | 09:58 PM

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై లాలూ మాట్లాడుతూ, అభ్యర్థుల ఎంపికపై సర్వే జరుపుతామని, ప్రజల నుంచే ఎమ్మెల్యేలను ఎంపిక చేస్తామని, దీనిపై ప్రజలతో చర్చిస్తామని చెప్పారు. ప్రజా విశ్వాసాన్ని వమ్ము కానీయమని చెప్పారు.

Lalu Prasad: తేజస్వికి త్వరలో పూర్తి బాధ్యతలు: లాలూ

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ (Tejaswi Yadav)పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ప్రశంసలు కురిపించారు. త్వరలో ఆయనకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం తేజస్వి అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని, పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.


'పార్టీని బలహీన పడనీయం. తేజస్వి అహోరాత్రులు కష్టపడతున్నారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తున్నారు. ఎన్నికలకు ముందు తేజస్వికి మరింత బలం చేకేర్చూలే పూర్తి స్థాయి బాధ్యతలు ఆయనకు అప్పగించాలి' అని లాలూ అన్నారు. తన భార్య రబ్రీదేవి గురించి ప్రస్తావిస్తూ, ఆమె ఇటు తన ఆరోగ్యం గురించి చూసుకుంటూ, పార్టీ కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని చెప్పారు.


పార్టీ అభ్యర్థులపై..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై మాట్లాడుతూ, అభ్యర్థుల ఎంపికపై సర్వే జరుపుతామని, ప్రజల నుంచే ఎమ్మెల్యేలను ఎంపిక చేస్తామని, దీనిపై ప్రజలతో చర్చిస్తామని చెప్పారు. ప్రజా విశ్వాసాన్ని వమ్ము కానీయమని చెప్పారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్, నవంబర్ మాసాల్లో జరగాల్సి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

ఆ క్రెడిట్ నాకు ఇచ్చినందుకు థాంక్స్... ఠాక్రే సోదరుల కలయికపై సీఎం

ప్రముఖ వ్యాపారి కాల్చివేత.. శాంతిభద్రతలపై సీఎం సమీక్ష

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 09:59 PM