Share News

Robert Vadra: దేశం వీడి వెళ్లే అవకాశంపై వాద్రా ఏమన్నారంటే..?

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:58 PM

హరియాణా భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణ కోసం ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్డ్ వాద్రా రెండోరోజైన బుధవారంనాడు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా వచ్చారు.

Robert Vadra: దేశం వీడి వెళ్లే అవకాశంపై వాద్రా ఏమన్నారంటే..?

న్యూఢిల్లీ: తాను ఎవరికీ భయపడేది లేదని, తనను టార్గెట్ చేశారనేది చాలా స్పష్టమని రాబర్ట్ వాద్రా (Robert Vadra) అన్నారు. అయితే తాము సాఫ్ట్ టార్గెట్ కాదని, హార్డ్ టార్గెట్ అని, మరింత హార్డ్‌గా అవుతామని చెప్పారు. తనపై ఎంత బలంగా ఒత్తిడి తెస్తే అంత బలంగా తిగిగొస్తామని చెప్పారు. తాము దేశం విడిచి వెళ్లబోవడం లేదని కూడా చెప్పారు. హరియాణా భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణ కోసం ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్డ్ వాద్రా రెండోరోజైన బుధవారంనాడు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా వచ్చారు. విచారణకు హాజరుకావడానికి ముందు మీడియాతో వాద్రా మాట్లాడారు.

Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్


ఇప్పటికే 15 సార్లు హాజరయ్యా

''ఏజెన్సీ (ఈడీ) రెండోసార్లు సమన్లు పంపడం చూసి ఆశ్చర్యపోయాను. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఏజెన్సీ ముందు 15 సార్లు హాజరయ్యాను. 10 గంటలు ప్రశ్నించారు. 23,000 డాక్యుమెంట్లు అందజేశాను. 2019లో నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఈడీకి చూపించాను. అప్పట్లో నేను సమాధానం చెప్పిన దాన్నే మళ్లీ అడుగుతున్నారని చెప్పినప్పుడు అధికారులే ఆశ్చర్యపోయారు. ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని మాత్రం చెప్పగలను'' అని వాద్రా తెలిపారు.


ఇదే కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ సైతం తనకు క్లీన్ చిట్ ఇచ్చారని, హర్యానాలో విచారణ జరిగినప్పుడు ఈ కేసులో ఎలాంటి పొరపాటు జరగలేదని అధికార యంత్రాంగం కూడా గుర్తించిందని వాద్రా తెలిపారు. ఖట్టార్ స్వయంగా క్లీన్ చిట్ ఇచ్చిన ఏడేళ్ల తర్వాత మళ్లీ ప్రశ్నించడం ఏమిటో తనకు అర్ధం కావడం లేదన్నారు.


ఎక్కడికీ వెళ్లేది లేదు..

ఈడీ ప్రశ్నల సందర్భంలో విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలున్నట్టు వస్తున్న ఊహాగానాలను వాద్రా కొట్టివేశారు. తాను దేశం విడిచి పారిపోయేది లేదన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని, తనను ప్రశ్నించాల్సిన అంశాలు కానీ, అన్ని ఏజెన్సీలు తనపై ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. దీనికి ముందు కూడా వాద్రా 'ఫేస్‌బుక్' పోస్ట్‌లో తనకు నిజంపై నమ్మకం ఉందని, నిజమే గెలుస్తుందని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు

Updated Date - Apr 18 , 2025 | 01:45 PM