Share News

Amit Shah: నన్ను కూడా కొట్టారు..ఏడు రోజులు జైలు తిండి తిన్నా

ABN , Publish Date - Mar 15 , 2025 | 04:55 PM

అసోంలోని డెర్గావ్‌లో ''లచిచ్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీ''ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారంనాడు ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మిజోరంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అసోం వచ్చారు.

Amit Shah: నన్ను కూడా కొట్టారు..ఏడు రోజులు జైలు తిండి తిన్నా

గోలాఘాట్: కాంగ్రెస్ హయాంలో ఒకప్పుడు అసోంలో తనకు ఎదురైన అనుభవాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) గుర్తుచేసుకున్నారు. అసోం (Assam)లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనను కొట్టడం, జైలులో పెట్టడం జరిగిందని, ఏడు రోజుల పాటు జైలు తిండి తిన్నానని అమిత్‌షా చెప్పారు. అసోంలోని డెర్గావ్‌లో ''లచిచ్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీ''ని శనివారంనాడు ఆయన ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మిజోరంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడకు వచ్చారు.

Ranya Rao: చెంపదెబ్బలు కొట్టారు, తిండిపెట్టలేదు.. డీఆర్ఐ ఏడీజీకి రన్యారావు లేఖ


"అసోంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నన్ను కూడా కొట్టారు. అప్పుడు ముఖ్యమంత్రిగా హితేశ్వర్ సైకియా ఉన్నారు. మేము ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా "అస్సాం కీ గాలియాన్ సునీ హై, ఇందిరా గాంధీ ఖూనీ హై'' అనే నినాదులు ఇచ్చేవాళ్లం. నేను కూడా అసోంలో జైలు తిండి తిన్నాను. అసోంని కాపాడేందుకు యావద్దేశం నుంచి ప్రజలు వచ్చారు. ఈరోజు అసోం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది" అని అమిత్‌షా తెలిపారు. అసోం సీఎంగా హితేశ్వర్ సైకియా 1983-85, 1991-1996 వరకూ ఉన్నారు.


పోరాట యోధుడు లచిత్ బర్ఫుకాన్

మెఘులులకు వ్యతిరేకంగా విజయం సాధించడంలో అసోంకు సహకరించిన పోరాట యోధుడు లచిత్ బర్ఫూకాన్ అని, ఆయన పేరును పోలీసు అకాడమీకి పెట్టిన సీఎం హిమంత్ శర్మ అభినందనీయుడని అమిత్‌షా అన్నారు. లచిత్ బర్ఫూకాన్ అసోంకే పరిమితమైనప్పటికీ ఆయన బయోగ్రపీ 23 భాషల్లో వెలువడి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. రాబోయే ఐదేళ్లలో లచిత్ బర్ఫుకాన్ పోలీసు అకాడమీ దేశంలోనే నెంబర్ వన్ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 15 , 2025 | 04:56 PM