ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డుల జారీ ఈసీ
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:23 AM
కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్న వారితో పాటు, పాత వాటిల్లో వివరాలు మార్చుకున్న వారికి కూడా దీనిని అమలు చేయాలని నిర్ణయించింది.

న్యూఢిల్లీ, జూన్ 18: ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకున్న 15 రోజుల్లోనే ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేసేలా ఎన్నికల సంఘం నూతన ప్రక్రియను ప్రవేశపెట్టింది. కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్న వారితో పాటు, పాత వాటిల్లో వివరాలు మార్చుకున్న వారికి కూడా దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఓటరు కార్డుల జారీకి నెల రోజులకు పైగా సమయం పడుతున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ సమయాన్ని సగానికి పైగా తగ్గించాలని నిర్ణయించింది. పేర్ల నమోదు నుంచి కార్డుల జారీ వరకు ఉన్న ప్రతి దశను తక్షణ పర్యవేక్షణ చేయనున్నట్లు వివరించింది. ఓటరు కార్డుల స్థితి గురించి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎ్‌సల ద్వారా తెలియజేస్తామని పేర్కొంది.