Share News

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై చైనా మీడియా తప్పుడు సమాచారం.. భారత్ ఆగ్రహం

ABN , Publish Date - May 07 , 2025 | 06:56 PM

పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లోపలకు భారత సైన్యం చొచ్చుకెళ్లి క్రూయిజ్ క్రిపణి దాడులు జరిపిందంటూ ''గ్లోబల్ టైమ్స్'' కథనం పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించిన 9 ప్రాంతాల్లో 24 ప్రెసిషన్ మిసైల్ స్ట్రైక్ జరిపిందని తెలిపింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై చైనా మీడియా తప్పుడు సమాచారం.. భారత్ ఆగ్రహం

న్యూఢిల్లీ: హహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థాపవరాలపై మంగళవారం ఆర్థరాత్రి మెరుపుదాడి చేసింది. కేవలం 23 నిమిషాల్లో 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదం నడ్డివిరిచేందుకు భారత్ తీసుకున్న సైనిక చర్యకు సమర్ధిస్తూ పలు ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తుంటే, చైనా స్టేట్ మీడియా 'గ్లోబల్ టైమ్స్' తప్పుడు సమాచార వ్యాప్తికి ప్రయత్నించి అభాసుపాలైంది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు రాయడం మానాలంటూ భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది.

Rajnath Singh: అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టాం.. రక్షణ మంత్రి


operation2.jpg

పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లోపలకు భారత సైన్యం చొచ్చుకెళ్లి క్రూయిజ్ క్రిపణి దాడులు జరిపిందంటూ ''గ్లోబల్ టైమ్స్'' కథనం పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించిన 9 ప్రాంతాల్లో 24 ప్రెసిషన్ మిసైల్ స్ట్రైక్ జరిపిందని తెలిపింది. ఆపరేషన్ సిందూర్‌‌ ఫోటోలంటూ కుప్పకూలిన విమానాల పాత ఫోటోలను చూపించింది. ఈ కథనంపై చైనాలోని ఇండియన్ ఎంబసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ''డియర్ గ్లోబల్ టైమ్స్.. ఈ తరహా తప్పుడు సమాచారం ఇచ్చే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిందిగా మేము సిఫారసు చేస్తున్నాం'' అని సోషల్ మీడియా ఫోస్ట్‌లో పేర్కొంది.


operation3.jpg

ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి పాక్ అనుకూల హ్యాండిల్స్ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, మీడియా సంస్థలు ఇలాంటి సమాచారం షేర్ చేసేటప్పుడు సంబంధిత వర్గాలను సంప్రదించి ధ్రువీకరించుకోవాలని సూచించింది. అలాకాకుండా కథనాలు ప్రచురించడం తీవ్రమైన బాధ్యతారాహిత్యమవుతుందని, జర్నలిస్టిక్ ఎథిక్స్‌కు విరుద్ధమవుతుందని ఇండియన్ ఎంబసీ ఘాటుగా విమర్శించింది.


operation4.jpg

కాగా, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సైతం "గ్లోబల్ టైమ్స్'' కథనంలో పాత ఫోటోలను ప్రస్తుత ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించినట్టు నిర్ధారించింది. ఇందులో ఒక ఫోటో 2024 సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) మిగ్-29 విమానం కూలిపోయినప్పటికి కాగా, రెండవది 2021లో పంజాబ్‌లో ఐఏఎఫ్ మిగ్-21 కుప్పకూలినప్పడిదిగా తేల్చింది.


ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా 26 మందిని కాల్చిచంపిన ఘటనను ''గ్లోబల్ టైమ్స్'' దృష్టికి చైనాలోని ఇండియన్ ఎంబసీ తీసుకువచ్చింది. ''ఈ అంశంలో వాస్తవాలేమిటో మీ దృష్టికి తెస్తున్నాం. 2025, ఏప్రిల్ 22న పాకిస్థాన్, పాక్‌లో శిక్షణ పొందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు భారత్‌లోని జమ్మూకశ్మీర్‌లో పహల్గాం వద్ద టూరిస్టులపై పాశవిక దాడి చేశారు. మతం అడిగి మరీ 26 మందిని (వీరిలో ఒక నేపాల్ జాతీయుడు ఉన్నారు) తుపాకులతో తలలకు గురిపెట్టి కుటుంబ సభ్యుల ముందే కాల్చిచంపారు. 2008 నవంబర్‌లో జరిగిన ముంబై దాడి తర్వాత జరిగిన అత్యంత తీవ్రమైన దాడి ఇది'' అని తెలిపింది.


పాకిస్థానీ ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన లష్కరే తొయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఈ దాడికి తామే బాధ్యులమంటూ ప్రకటించిన విషయాన్ని కూడా చైనా మీడియా దృష్టికి భారత ఎంబసీ తీసుకువచ్చింది. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా తమ సొంత గడ్డపై ఉగ్రవాదులను కానీ, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై కానీ పాక్ ఎలాటి చర్యా తీసుకోలేదని, పైగా నిరాధార ఆరోపణలంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని తెలిపింది. ఇదే సమయంలో పాక్‌ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ మరికొన్ని దాడులకు పాల్పడవచ్చంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తమకు సమచారం ఉందని ఇండియన్ ఎంబసీ వివరించింది.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: వ్యోమికా, ఖురేషీ గురించి ఈ విషయాలు తెలుసా

ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ఈ మిసైల్స్ గురించి తెలుసా

Updated Date - May 07 , 2025 | 08:16 PM