Share News

Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్‌తో అమెరికా ఇంటెల్ చీఫ్ తులసీ గబ్బర్డ్ భేటీ

ABN , Publish Date - Mar 17 , 2025 | 03:34 PM

తులసి గబ్బర్డ్‌తో సమావేశమైన విషయాన్ని సామాజిక మాధ్యం 'ఎక్స్'లో రాజ్‌నాథ్ సింగ్ షేర్ చేశారు. రక్షణ, సమాచార షేరింగ్‌తో పాటు, ఇండియా-యూఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమావేశంలో చర్చించినట్టు చెప్పారు.

Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్‌తో అమెరికా ఇంటెల్ చీఫ్ తులసీ గబ్బర్డ్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Rajnath Singh)తో ఆమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ (Tulsi Gabbard) సోమవారంనాడు సమావేశమయ్యిరు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం బలోపేతంపై చర్చించారు. ఒక రక్షణ ఒప్పందపైన కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

RG Kar Case: కోల్‌కతా హైకోర్టుకు వెళ్లవచ్చు.. బాధితురాలి తల్లిదండ్రులకు సుప్రీం అనుమతి


తులసి గబ్బర్డ్‌తో సమావేశమైన విషయాన్ని సామాజిక మాధ్యం 'ఎక్స్'లో రాజ్‌నాథ్ సింగ్ షేర్ చేశారు. రక్షణ, సమాచార షేరింగ్‌తో పాటు, ఇండియా-యూఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమావేశంలో ఉభయులూ చర్చించినట్టు చెప్పారు.


ట్రంప్ రెండో విడత కార్యవర్గంలోని సీనియర్ స్థాయి అధికారి భారత్ పర్యటించడం ఇది మొదటిసారి. రెండున్నర రోజుల పర్యటనలో భాగంగా ఆదివారంనాడు న్యూఢిల్లీకి వచ్చిన ఆమె గ్లోబల్ ఇంటెలిజెన్స్ కాంక్లేవ్‌లూ కూడా పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబల్‌తోనూ ఆదివారం సాయంత్రం గబ్బర్డ్ సమావేశమయ్యారు. భారత్, అమెరికా మధ్య భద్రతారంగంలో బంధాన్ని బలోపేతం చోసుకోవడంతో ఉభయులూ చర్చించారు. ఇండో-పసిఫిక్, ఖలిస్థానీ ఉగ్రవాదం వంటి అంశాలు కూడా చర్చించినట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Kharge: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2025 | 03:35 PM