US Visa: అమెరికా వీసాకు కొత్త నిబంధన.. తక్షణమే అమల్లోకి
ABN , Publish Date - Jun 23 , 2025 | 09:35 PM
అమెరికా చట్టాలకు అనుగుణంగా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాలను పరిశీలించేందుకు అనుగుణంగా మార్పులు చేయాలని ఇండియాలోని యూఎస్ ఎంబసీ ఆ ప్రకటనలో పేర్కొంది.

న్యూఢిల్లీ: అమెరికా వీసాకు అప్లై చేసే భారతీయ పౌరులకు కొత్త నిబంధనను అగ్రరాజ్యం అమల్లోకి తీసుకువచ్చింది. ఎఫ్, ఎం, జే (F,M,J) నాన్-ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తుదారులంతా ఇక మీదట తమ సోషల్ మీడియా అకౌంట్ వివరాలను వెల్లడించాలని నిబంధన పెట్టింది. సోషల్ మీడియా అకౌంట్లను ప్రైవసీ నుంచి పబ్లిక్‌కు మార్చాలని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది.
అమెరికా చట్టాలకు అనుగుణంగా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాలను పరిశీలించేందుకు అనుగుణంగా మార్పులు చేయాలని ఇండియాలోని యూఎస్ ఎంబసీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఎఫ్, ఎం, జే వీసాలను నాన్-ఇమిగ్రెంట్ వీసాలుగా ఫారెన్ నేషనల్స్‌కు ఏజెన్సీ జారీ చేస్తుంటుంది. అకడమిక్ స్టూడెంట్ల కోసం 'ఎఫ్' వీసాలు, వొకేషనల్ స్టూడెంట్ల కోసం 'ఎం' వీసాలు, రీసెర్చర్లు, స్కాలర్కు, ఇంటర్న్ సహా ఎక్స్ఛేంజ్ విజిటర్ల కోసం 'జే' వీసాలు జారీ చేస్తుంటారు.
కొత్త నిబంధనల ప్రకారం యుఎస్‌లో చదువు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలో పాల్గొనాలని అనుకునే వారు వీసా అప్లికేషన్లు సమర్పించడానికి ముందే తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చాల్సి ఉంటుంది. దీంతో అధికారులు ఈజీగా అప్లికెంట్ల ఆన్‌లైన్ సమాచారాన్ని తెలసుకునే వీలుంటుంది. అయితే, అప్లికెంట్లు తమ ప్రొఫైల్‌ను ఎంతకాలం పబ్లిక్‌లో ఉంచాలనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి..
అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్
సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి
For National News And Telugu News