Unrecognized Political Parties: గుర్తింపు పొందని పార్టీల రాబడి 223% పెరుగుదల
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:33 AM
ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకొని, గుర్తింపు పొందని రాజకీయ పార్టీల ఆదాయం..

టాప్ టెన్ పార్టీల ఆదాయమే రూ.1,581 కోట్లు
వీటిలో గుజరాత్‌లోని పార్టీల వాటా 1,158 కోట్లు
గుర్తింపు పొందని పార్టీలు దేశవ్యాప్తంగా 2,764
739 పార్టీల ఆడిట్ వివరాలే అందుబాటులో
ఈసీ వద్ద నమోదై గుర్తింపు పొందని పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో 129.. తెలంగాణలో 78
2022-23 ఆర్థిక సంవత్సరంపై ఏడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకొని, గుర్తింపు పొందని రాజకీయ పార్టీల ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 223 శాతం మేర పెరిగింది. గుర్తింపు పొందని పార్టీల్లో 73శాతం పార్టీలు తమ ఆర్థిక లావాదేవీలను బహిర్గతపర్చడంలో విఫలమయ్యాయి. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 22 రాష్ట్రాల్లోని 2,764 గుర్తింపు పొందని పార్టీల్లో 739(26.74ు) పార్టీల వార్షిక ఆడిట్, కాంట్రిబ్యూషన్ రిపోర్టులను సంబంధిత రాష్ట్రాల సీఈవోల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 739 పార్టీల్లోంచి అత్యధికంగా గుజరాత్‌లో 30.53ు, ఢిల్లీలో 21.67ు పార్టీలున్నాయి. 739 పార్టీల్లో తొలి పది పార్టీల ఆదాయం రూ.1581.75 కోట్లు ఉండగా.. వీటిలో గుజరాత్‌కు చెందిన పార్టీల వాటే రూ.73.22శాతం! అంటే.. 1581.75 కోట్లలో గుజరాత్ పార్టీల వాటా 1158.15 కోట్లు!! వీటిలో భారతీయ నేషనల్ జనతాదళ్ పేరుతో ఉన్న పార్టీ రూ.576.45 కోట్ల ఆదాయాన్ని ప్రకటించిందని, ఆ రాష్ట్రానికే న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ రూ.407.45 కోట్ల మేర విరాళాలొచ్చాయని పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. 2019-24 వరకు రూ.957.44 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు భారతీయ నేషనల్ జనతాదళ్ ప్రకటించినట్లు నివేదిక వెల్లడించింది. గుర్తింపు పొందని పార్టీల్లో దాదాపు అన్నీ విరాళాల మీదే ఆధారపడుతున్నట్లు తేలిందని వివరించింది. రూ.20వేల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన దాతల నుంచి జాతీయ పార్టీలకు 33ు నిధులే సమకూరాయని.. గుర్తింపు పొందని పార్టీల్లో ఓ పది పార్టీలకు 93శాతం మేర విరాళాలొచ్చాయని ఏడీఆర్ వెల్లడించడం విశేషం. గుర్తింపు పొందని పార్టీల్లో అత్యధికంగా యూపీలో 744 ఉన్నాయని నివేదిక పేర్కొంది. తెలంగాణలో కూడా 78 గుర్తింపు పొందని నమోదైన పార్టీలు ఉన్నాయని వాటిలో 46 పార్టీల ఆదాయ వివరాలు సీఈవోల వద్ద లేవని తెలిపింది.
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 13ఏ కింద పన్ను మినహాయింపులను ఉపయోగించుకునే ఏకైక లక్ష్యంతోనే గుర్తింపు పొందని పార్టీల్లో చాలావరకు అవతరించాయని, ఇవేవీ కూడా ఎన్నికల కార్యకలాపాలు జరిపిన దాఖలాలు లేవని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. రాజకీయ పార్టీలను ఆదాయపన్ను చట్టం నుంచి మినహాయించిన ఎన్నికల సంఘం రు. 20వేలకు మించి విరాళాలు సేకరిస్తే తమ ఆడిట్ నివేదికలను సమర్పించాలనే నిబంధనలు విధించిందని, అయితే చాలా పార్టీలు తమ విరాళాల వివరాలు వెల్లడించలేదని నివేదిక స్పష్టం చేసింది. కాగా ఐదేళ్లకుపైగా నిష్ర్కియాత్మకంగా ఉన్న పార్టీలను ఎన్నికల సంఘం నుంచి తొలగించాలని ఏడీఆర్ సిఫారసు చేసింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి