Share News

Odisha Self Immolation: ఒడిశా విద్యార్థిని ఆత్మాహుతి ఘటనపై యుజీసీ కీలక నిర్ణయం

ABN , Publish Date - Jul 15 , 2025 | 06:58 PM

ఒడిశా విద్యార్థిని ఆత్మాహుతి ఘటనకు దారితీసిన పరిస్థితులపై నలుగురు సభ్యుల కమిటీ విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన సూచనలు చేస్తుందని యూజీసీ సెక్రటరీ సుదీప్ సింగ్ జైన్ తెలిపారు.

Odisha Self Immolation: ఒడిశా విద్యార్థిని ఆత్మాహుతి ఘటనపై యుజీసీ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ఒడిశా (Odisha) లోని ఫకీర్ మోహన్ క్యాంపస్‌‌లో ప్రొఫెసర్ వేధింపులకు తాళలేక 20 ఏళ్ల బీజేపీ రెండో సంవత్సరం విద్యార్థిని ఒంటిపై నిప్పటించుకుని ఆత్మాహుతికి దిగిన ఘటన తీవ్ర సంచలనమైంది. దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (UGC) తక్షణ చర్యలకు దిగింది. ఈ దారుణ ఘటనపై విచారణకు నలుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. క్యాంపస్‌లో వేధింపుల ఆరోపణలపైన, వేధింపుల నిరోధక చట్టాలకు అనుగుణమైన చర్యలు అమలవుతున్నాయా వంటి అంశాలపై కమిటీ విచారణ జరిపి దిద్దుబాటు చర్యలకు సిఫారసు చేస్తుంది.


అధికారుల సమాచారం ప్రకారం, కాలేజీ హెచ్ఓడీ సమీర కుమార్ సాహు తనపై పాల్పడుతున్న లైంగిక వేధింపులను భరించలేక యాజమాన్యం, ప్రిన్సిపాల్‌కు విద్యార్థిని ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారు స్పందించక పోవడంతో మనోవైదనతో ఆత్మహత్యాయత్నం చేసింది. కాలేజీ కారిడార్‌లోనే నిప్పంటించుకుంది. 95 శాతం కాలిన గాయాలలో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 60 గంటల సేపు మృత్యువుతో పోరాడి సోమవారం రాత్రి కన్నుమూసింది.


ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై నలుగురు సభ్యుల కమిటీ విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన సూచనలు చేస్తుందని యూజీసీ సెక్రటరీ సుదీప్ సింగ్ జైన్ తెలిపారు. గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ ప్రొఫెసర్, యూజీసీ సభ్యుడు రాజ్ కుమార్ మిట్టల్ ఈ కమిటీకి సారథ్యం వహిస్తారని చెప్పారు. యూజీసీ మాజీ సభ్యుడు సుష్మా యాదవ్, గుజరాత్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సిలర్ నీరజ్ గుప్తా, యూజీసీ జాయింట్ సెక్రటరీ ఆషిమా మంగ్లా కమిటీ సభ్యులుగా ఉంటారు.


ఇవి కూడా చదవండి..

ఆర్మీపై వ్యాఖ్యల కేసులో రాహుల్‌గాంధీకి బెయిల్

ముంబై పేలుళ్లను సంజయ్ దత్ ఆపగలిగేవాడు: ఉజ్వల్ నికమ్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 07:46 PM