Share News

Raja Raghuvanshi Murder case: కీలక మలుపు.. సెక్యూరిటీ గార్డ్, ప్రాపర్టీ డీలర్ అరెస్టు

ABN , Publish Date - Jun 22 , 2025 | 06:26 PM

సిలోమె జేమ్స్ అనే ప్రాపర్టీ డీలర్‌‌ను దేవాస్ జిల్లా భౌంరసా టోల్ గోట్ వద్ద సిట్ టీమ్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్టు ఈస్ట్ ఖాసి హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ సిమ్ తెలిపారు. భోపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సిమ్‌ను పట్టుకున్నట్టు తెలుస్తోంది.

Raja Raghuvanshi Murder case: కీలక మలుపు.. సెక్యూరిటీ గార్డ్, ప్రాపర్టీ డీలర్ అరెస్టు
Raja Raghuvanshi and Sonam

ఇండోర్: ఇండోర్ వ్యాపారి రాజా రఘవంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా మేఘాలయ పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అదివారంనాడు మరో ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేసింది. దీంతో ఈ హత్య కేసులో ఇంతవరకూ అరెస్టు చేసిన వారి సంఖ్య ఏడుకు చేరింది.


పారిపోతుండగా..

సిలోమె జేమ్స్ అనే ప్రాపర్టీ డీలర్‌‌ను దేవాస్ జిల్లా భౌంరసా టోల్ గోట్ వద్ద సిట్ టీమ్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్టు ఈస్ట్ ఖాసి హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ సిమ్ తెలిపారు. భోపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సిమ్‌ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. రఘవంశీ భార్య సోనమ్‌కు చెందిన కీలక సాక్ష్యమైన బ్యాగ్‌ను దాచిపెట్టడంలో సిమ్ కీలక పాత్ర వహించినట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఇండోర్‌లోని హీరాబాగ్ కాలనీలోని ఫ్లాట్‌ను అతను లీజ్‌కు ఇచ్చాడు.


సెక్యూరిటీ గార్డ్ అరెస్టు

కాగా, ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సెక్యూరిటీ గార్డు బల్లా అహిర్వార్‌ను అతని స్వగ్రామంలో అరెస్టు చేశారు. సోనమ్ నివసించిన ప్రాంతంలో సెక్యూరిటీ గార్డ్‌గా అతను ఉన్నాడు. రాజా రఘువంశీ హత్యానంతరం నగలు, ఇతర వస్తువులను అతను స్టోర్ చేసినట్టు చెబుతున్నారు. జేమ్, అహిర్వార్‌లను ఇండోర్‌లోని కోర్టుకు హాజరుపరచారు. తదుపరి విచారణ కోసం వీరిని షిల్లాంగ్‌కు తీసుకెళ్లేందుకు ట్రాన్సిట్ రిమాండ్‌ను సిట్ అధికారులు కోరారు.


హనీమూన్ ట్రిప్ కోసం భార్య సోనమ్‌తో కలిసి మేఘాలయ వెళ్లిన రాజా రఘువంశీ మే 23న కనిపించకుండా పోయారు. అయితే జూన్ 2న అతని మృతదేహం హీస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలోని ఒక జలపాతం సమీపంలో లోతైన ప్రదేశంలో కనిపించింది. దీంతో ఈ కేసు సంచలనమైంది. మృతుడి భార్య సోనమ్ ఈ హత్యకు కుట్ర పన్ని, తన ప్రియునితో కలిసి భర్తను చంపించినట్టు పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సోనమ్ పోలీసులకు లొంగిపోయింది. ఈ కేసులో మరింత లోతుగా సిట్ దర్యాప్తు చేస్తుండటంతో మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరిన మరో 311 మంది భారతీయులు

ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయుల తరలింపు

For National News And Telugu News

Updated Date - Jun 22 , 2025 | 06:30 PM