Trump: జపాన్, దక్షిణ కొరియాలపై 25% మేర సుంకాల హెచ్చింపు
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:33 AM
జపాన్, దక్షిణ కొరియా దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై విధిస్తున్న సుంకాలను 25ు మేర పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

వాషింగ్టన్, జూలై 7: జపాన్, దక్షిణ కొరియా దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై విధిస్తున్న సుంకాలను 25ు మేర పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. వివిధ రంగాల వారీగా ఇప్పుడు వసూలు చేస్తున్న పన్నులకు అదనంగా దీన్ని విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు జపాన్ ప్రధాని ఇషిబ షిగేరు, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జాయ్-మయుంగ్‌కు లేఖలు కూడా రాశారు. ఒకవేళ సుంకాన్ని ఎగవేయడానికి ప్రయత్నిస్తే మరింతగా పెంచుతామని పేర్కొన్నారు. ప్రతీకారంగా ఆ దేశాలు కూడా సుంకాలను పెంచితే కఠినంగా ఉంటామని తెలిపారు. పెంచిన శాతాన్ని, ఈ 25 శాతాన్ని కలిపి మొత్తం వసూలు చేస్తామని పేర్కొన్నారు. ద్వైపాక్షికంగా వాణిజ్యలోటు ఉండకూడదన్న ఉద్దేశంతోనే సుంకాలు పెంచినట్టు చెప్పారు.
టెక్స్‌స వరదల్లో 82కు పెరిగిన మృతుల సంఖ్య
కెర్‌విలే, జూలై 7: టెక్స్‌సలో భారీ వరదల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 82కు పెరిగింది. 41మంది గల్లంతయ్యారు. ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ టెక్స్‌సను మరోసారి వరద ముంచెత్తవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గల్లంతైనవారి కోసం 17 హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ధ్వంసమైన నివాసాలు, కార్యాలయాల శిథిలాల కింద చాలా మంది ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కెర్ కౌంటీని తీవ్ర వరద ప్రభావ ప్రాంతంగా గుర్తిస్తూ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం డిక్లరేషన్‌పై సంతకం చేశారు. 11న (శుక్రవారం) సదరు కౌంటీని సందర్శిస్తానని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి