Tiger: ఆ రహదారిలో పులి తిరుగుతోంది.. జాగ్రత్త..
ABN , Publish Date - Jun 28 , 2025 | 01:01 PM
కర్ణాటక రాష్ట్రంలోని సండూరు తాలుకా యశ్వంత్‌నగర నుంచి గరగా నాగలాపురం గ్రామ మార్గంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు మార్గంలో వంతెనపై పులి కనిపించింది. నాగలాపురం వెళ్లే వారు రోడ్డు పక్కనే పులి కనిపించడంతో పరుగులు తీశారు.

కంప్లి(బెంగళూరు): కర్ణాటక రాష్ట్రంలోని సండూరు తాలుకా యశ్వంత్‌నగర నుంచి గరగా నాగలాపురం గ్రామ మార్గంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు మార్గంలో వంతెనపై పులి కనిపించింది. నాగలాపురం(Nagalapuram) వెళ్లే వారు రోడ్డు పక్కనే పులి కనిపించడంతో పరుగులు తీశారు. అటవీ ప్రాంతం ఉండటంతో కొద్దిపాటి వర్షం కురుస్తుండటంతో అడవుల్లో ఉన్న ఎలుగుబంట్లు, పులులు తరచుగా కనిపిస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో అడవుల్లో నుంచి గ్రామాలకు ద్విచక్ర వాహనాలపై వెళ్లేందుకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో నామఫలకాలు, రోడ్డు పక్కన కంచెలు ఏర్పాటు చేయాలని ఫారెస్టు అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం
ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి
Read Latest Telangana News and National News