Amit Shah: ఉగ్ర హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: అమిత్‌షా
ABN , Publish Date - Apr 22 , 2025 | 06:50 PM
ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తున్నారని, ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమిత్‌షా చెప్పారు. భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీనగర్ వెళ్తున్నట్టు చెప్పారు.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి ఘటనను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఖండించారు. ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తున్నారని, ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీనగర్ వెళ్తున్నట్టు చెప్పారు.
Terror Attack: టూరిస్టులే టార్గెట్‌గా ఉగ్రదాడి.. ముగ్గురు మృతి, మోదీ ఫోన్, ఘటనా స్థలికి అమిత్‌షా
''పహల్గా్ంలో టూరిస్టులపై ఉగ్రదాడి తీవ్రంగా బాధించింది. ఇందులో పాల్గొన్న వారికి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఘటన గురించి ప్రధానమంత్రి మోదీకి వివరించారు. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరిపాను. అత్యవసర భద్రతా సమీక్ష కోసం శ్రీనగర్ వెళ్తున్నాను'' అని అమిత్‌షా ఒక ట్వీట్‌లో తెలిపారు.
రాజ్‌నాథ్ సింగ్ స్పందన
హహల్గాంలో ఉగ్రదాడి ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురించేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అమాయక పౌరులపై దాడి పిరికిపందల చర్య అని అన్నారు. బాధిత కుటుంబాలను తలుచుకుంటే ఆవేదన కలుగుతోందన్నారు. వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
ఇవి కూాడా చదవండి..