Jagdeep Dhankhar: జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమిటంటే
ABN , Publish Date - Jul 23 , 2025 | 09:36 PM
నిబంధనల ప్రకారం నెలవారీ వేతనంలో 50 నుంచి 60 శాతం పెన్షన్ వస్తుంది. ఆ విధంగా ధన్‌ఖడ్‌కు రూ.60,000 వరకూ పెన్షన్ వస్తుంది. లూటెన్స్ ఢిల్లీలో టైప్ VIII బంగ్లా కేటాయించే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవిలో ఉండగానే ఆరోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar) నిలుస్తారు. గతంలో వివీ గిరి, ఆర్ వెంకట్రామన్‌లు సర్వీసులో ఉండగానే పదవి నుంచి వైదొలిగారు. పదవి మధ్యలోనే తప్పుకుంటే వచ్చే రిటైర్మెంట్ ప్రయోజనాలు ఏవిధంగా ఉంటాయనేది చూస్తే... ఉప రాష్ట్రపతిగా రెండేళ్ల పాటు సేవలందించిన వారు పెన్షన్‌కు అర్హులవుతారు. ఆ ప్రకారం ధన్‌కఢ్‌కు రిటైర్‌మెంట్ ప్రయోజనాలు వర్తిస్తాయి.
నిబంధనల ప్రకారం నెలవారీ వేతనంలో 50 నుంచి 60 శాతం పెన్షన్ వస్తుంది. ఆ విధంగా ధన్‌ఖడ్‌కు రూ.60,000 వరకూ పెన్షన్ వస్తుంది. లూటెన్స్ ఢిల్లీలో టైప్ VIII బంగ్లా కేటాయించే అవకాశం ఉంది. అలాకాకుండా ఇండియాలో వేరెక్కడైనా కోరుకుంటే అద్దె, విద్యుత్, నీటి బిల్లులు వంటివి జీవితాంతం చెల్లించనవసరం లేకుండా సౌకర్యం కల్పిస్తారు. సెక్రటేరియట్ స్టాఫ్‌గా ప్రైవేటు సెక్రటరీ, అడిషనల్ ప్రైవేటు సెక్రటరీ, పెర్సనల్ అసిస్టెంట్, ఇద్దరు ప్యూన్లను ఇస్తారు.
ఇండియాలో ఎక్కడికైనా విమానం, రైలు, స్టీమర్‌లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ధన్‌ఖడ్‌కు ఉంటుంది. తోడుగా ఒకరిని తీసుకువెళ్లవచ్చు. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, రెండు మొబైల్ ఫోన్ల సౌకర్యం కల్పిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యంతో పాటు వ్యక్తిగత డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు.
ఇవి కూడా చదవండి..
బిహార్‌లో లక్ష మంది ఓటర్లు మిస్సింగ్.. రెండ్రోజులే గడువు
పాపులర్ సీఎం ఫేస్ తేజస్వి, వెనుకబడిన నితీష్.. సర్వే వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి