Bomb Scare: బస్టాండ్‌లో డిటొనేటర్లు, జిలెటిన్ స్టిక్‌లు.. సెక్యూరిటీ అలర్ట్
ABN , Publish Date - Jul 23 , 2025 | 07:27 PM
బస్టాండ్‌లో పేలుడు పదార్ధాలు కనిపించడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఘటన అనంతరం బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో అధికారులు భద్రతా చర్యలను పటిష్టం చేశారు. పేలుడు పదార్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుక ఉద్దేశం ఏమటనే దానిపై ఆరా తీస్తున్నారు.

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో బాంబుల కలకలం రేగింది. కలసిపాళ్యలోని బీఎంటీసీ బస్టాండ్‌లో 6 జిలెటిన్ స్టిక్‌లు, డిటొనేటర్లను పోలీసులు బుధవారం నాడు స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్‌లోని టాయిలెట్ బయట క్యారీ బ్యాగ్‌లో వీటిని గుర్తించారు. ఈ ఘటనతో బస్టాండ్‌లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని వెస్ట్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.గిరీష్ ధ్రువీకరించారు. టాయిలెట్ బయట ఒక బ్యాగులో జిలెటిన్ స్టిక్‌లు, కొన్ని డిటొనేటర్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో వెంటనే సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించామని, బాంబు డిస్పోజల్ స్వ్కాడ్ అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుందని తెలిపారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నామని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందని చెప్పారు.
బస్టాండ్‌లో పేలుడు పదార్ధాలు కనిపించడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఘటన అనంతరం బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో అధికారులు భద్రతా చర్యలను పటిష్టం చేశారు. పేలుడు పదార్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుక ఉద్దేశం ఏమటనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి..
పాపులర్ సీఎం ఫేస్ తేజస్వి, వెనుకబడిన నితీష్.. సర్వే వెల్లడి
అల్‌ఖైదా కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్టు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి