Share News

Travelling Tips: అమెరికాకు ప్రయాణిస్తున్నారా.. చెక్-ఇన్ లగేజీలో ఈ 7 వస్తువులు నిషేధం..

ABN , Publish Date - May 20 , 2025 | 04:22 PM

అమెరికాకు ప్రయాణించాలని అనుకుంటున్నారా? అయితే, చెక్-ఇన్ లగేజీలో ఈ 7 వస్తువులు నిషేధం. అమెరికా భద్రతా సంస్థ TSA కొన్ని వస్తువులను నిషేధించింది. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 Travelling Tips: అమెరికాకు ప్రయాణిస్తున్నారా.. చెక్-ఇన్ లగేజీలో ఈ 7 వస్తువులు నిషేధం..
Airport

విమాన ప్రయాణాలపై అమెరికా (US) ఎంతో కఠినమైన భద్రతా నియమాలను అమలు చేస్తుంది. ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) అనే సంస్థ ప్రయాణికుల భద్రత కోసం కొన్ని వస్తువులను లగేజీలో పెట్టకూడదని నిషేధించింది. ఇవి కేవలం చెక్-ఇన్ బాగ్స్‌కే కాకుండా హ్యాండ్ లగేజీకి కూడా వర్తించవచ్చు. అగ్ని ప్రమాదాల కారణంగా అన్ని US విమానాలలో లగేజీ నుండి ఏడు లిథియం బ్యాటరీతో నడిచే వస్తువులను TSA నిషేధించింది. అమెరికా వెళ్లే విమానాల్లో చెక్-ఇన్ లగేజీలో ఉంచకూడని 7 ముఖ్యమైన నిషేధిత వస్తువుల గురించి తెలుసుకుందాం..


నిషేధించబడిన 7 వస్తువులు

  • పవర్ బ్యాంకులు

  • సెల్‌ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ కేసులు

  • విడి లిథియం-అయాన్ బ్యాటరీలు

  • విడి లిథియం-మెటల్ బ్యాటరీలు

  • సెల్‌ఫోన్ బ్యాటరీలు

  • ల్యాప్‌టాప్ బ్యాటరీలు

  • బాహ్య బ్యాటరీ ప్యాక్‌లు, పోర్టబుల్ రీఛార్జర్‌లుపోర్టబుల్ రీఛార్జర్‌లు


అగ్ని ప్రమాదాలను కలిగిస్తాయి..

ఈ వస్తువులు సాధారణంగా లిథియం-అయాన్ లేదా లిథియం-మెటల్ బ్యాటరీలను కలిగి ఉంటాయి. ఇవి కొన్ని పరిస్థితులలో అగ్ని ప్రమాదాలను కలిగిస్తాయి. FAA(ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్) మార్గదర్శకాల ప్రకారం, లిథియం బ్యాటరీలు వేడెక్కి "థర్మల్ రన్‌ అవే" అనే ప్రమాదకరమైన రసాయన ప్రతిచర్యను ప్రేరేపిస్తాయి. ఇవి భౌతిక నష్టం, వేడి లేదా నీటికి గురికావడం, అధిక ఛార్జింగ్, ప్యాకింగ్ సరిగాలేకపోవడం లేదా అంతర్గత తయారీ లోపాల వంటి అనేక కారణాల వల్ల అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరగవచ్చు. ముఖ్యంగా విమానంలోని కార్గో హోల్డ్‌లో థర్మల్ రన్‌అవే పొరుగు బ్యాటరీలకు వేగంగా వ్యాపించి, అదుపు చేయలేని అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తుందని FAA హెచ్చరిక జారీ చేసింది.

గేటు వద్ద లేదా విమానం పక్కన క్యారీ-ఆన్ బ్యాగ్‌ను తనిఖీ చేసినప్పుడు, అన్ని విడి లిథియం బ్యాటరీలు, పవర్ బ్యాంక్‌లను బ్యాగ్ నుండి తీసి విమాన క్యాబిన్‌లో ప్రయాణీకుడితో పాటు ఉంచాలని, బ్యాటరీ టెర్మినల్స్ షార్ట్ సర్క్యూట్ నుండి సురక్షితంగా ఉండాలని FAA ఒక ప్రకటనలో తెలిపింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తరచుగా విమానాలలో బ్యాటరీల కారణంగా అగ్ని ప్రమాద సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్లే TSA ఈ నిబంధనలను అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది.


Also Read:

Kanpur Wife: అల్లుడితో ఎఫైర్.. విషయం భర్తకు తెలిసిందని..

Hyderabad Metro: ఛార్జీలపై మెట్రో తాజా నిర్ణయం ఇదే

Rajdhani Express: రెండు రైళ్లను పట్టాలు తప్పించే ప్రయత్నం.. లోకోపైలట్ల అప్రమత్తతో తప్పిన ప్రమాదం

Updated Date - May 20 , 2025 | 04:28 PM