Shashi Tharoor Congress Rift: థరూర్ మాతో లేరు.. కాంగ్రెస్ కార్యక్రమాలకు పిలవం
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:53 AM
కాంగ్రెస్ పార్టీ వైఖరికి భిన్నంగా వెళ్తున్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌పై కేపీసీసీ మాజీ అధ్యక్షుడు ..

తేల్చి చెప్పిన కేపీసీసీ మాజీ అధ్యక్షుడు కె.మురళీధరన్
తిరువనంతపురం, జూలై 20: కాంగ్రెస్ పార్టీ వైఖరికి భిన్నంగా వెళ్తున్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌పై కేపీసీసీ మాజీ అధ్యక్షుడు కె.మురళీధరన్ విరుచుకుపడ్డారు. థరూర్ తమతో లేడని, ఇకపై కేరళలో జరిగే కాంగ్రెస్ కార్యక్రమాలకు ఆయన్ను పిలవబోమని స్పష్టం చేశారు. థరూర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడని, ఆయనపై ఏ చర్యలు తీసుకోవాలనేది అధిష్టానమే నిర్ణయించాలని మురళీధరన్ చెప్పారు. కేరళలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా శశిథరూర్ ఉత్తమమంటూ ఇటీవల ఓ సర్వేలో వెల్లడైనప్పుడు కూడా మురళీధరన్ ఘాటుగా స్పందించారు. అసలు థరూర్ ఏ పార్టీలో ఉన్నారో ముందుగా చెప్పాలని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో థరూర్ కేంద్రాన్ని సమర్థించారు. జాతీయ భద్రత విషయంలో పార్టీలకు అతీతంగా స్పందించాలని అన్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ నేతల విమర్శలు మొదలయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News