Operation Mahadev: పహల్గాం ఉగ్రవాదిని మట్టుబెట్టాం.. బీజేపీ ఎంపీ జే పాండా
ABN , Publish Date - Jul 28 , 2025 | 06:47 PM
ఆపరేషన్ సింధూర్ హైలైట్స్‌ను జే పాండా వివరిస్తూ, భారత వాయిసేన పాక్‌లోని 11 వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని, 20 శాతం పాక్ వాయిసేన ఆస్తులను ధ్వంసం చేసిందని చెప్పారు. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు చెప్పారు.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న యాంటీ టెర్రర్ అపరేషన్ (Operation Mahadev)లో పహల్గాం ఉగ్రదాడితో ప్రమేయం ఉన్న ఒక టెర్రరిస్టును బలగాలు మట్టుబెట్టినట్టు బీజేపీ ఎంపీ బైజయంత్ జే పాండా (Baijayant Jay Panda) లోక్‌సభకు తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌పై సొమవారంనాడు ప్రత్యేక చర్చలో ఆయన పాల్గొంటూ, ఆపరేషన్ సింధూర్‌పై ఒకవైపు సభలో చర్చజరుగుతుండగా మరోవైపు ఆపరేషన్ మమదేవ్ నడుస్తోందని, ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. వీరిలో ఒక ఉగ్రవాదికి పహల్గాం ఉగ్రదాడితో ప్రమేయం ఉందని వివరించారు.
ఆపరేషన్ సింధూర్ హైలైట్స్‌ను జే పాండా వివరిస్తూ, భారత వాయిసేన పాక్‌లోని 11 వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని, 20 శాతం పాక్ వాయిసేన ఆస్తులను ధ్వంసం చేసిందని చెప్పారు. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు చెప్పారు. ఈ దాడులను పాకిస్థాన్ తిప్పికొట్టడంలో విఫలమైందన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో పాక్ వైఫల్యాన్ని విపక్షాలు గుర్తించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ గత వైఫల్యాలు
గతంలో జరిగిన ఉగ్ర ఘటనలను జే పాండా గుర్తు చేస్తూ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలకు దీటుగా సమాధానం ఇవ్వలేకపోయాయని అన్నారు. ఇంతకుముందు తరచూ పాక్ ప్రేరేపిత దాడులు ఇండియాపై, ప్రజలపై జరిగేవని, 2005లో ఢిల్లీ వరుస పేలుళ్లు, 2006లో వారణాసి బాంబింగ్స్ జరిగినప్పుడు కేవలం మాటలతోనే సరిపుచ్చారని అన్నారు. 2008 ముంబై దాడుల తర్వాత మన సాయుధ బలగాలు ప్రతీకార చర్యలకు ప్లాన్ చేసినప్పటికీ ప్రభుత్వం అనుమతించ లేదని విమర్శించారు. ఆరు నెలల తర్వాత అప్పటి ప్రధానమంత్రి.. పాకిస్థాన్ అధ్యక్షుడిని కలిసి చర్చలు కొనసాగించాలని నిర్ణయించారని గుర్తుచేశారు. ఉగ్రవాదంపై చేష్టలుడిగి చూడటం, బుజ్జగింపు విధానాలకే ప్రభుత్వాలు పరిమితమయ్యాయని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ వైఫల్యాలు విపక్షాలకు కనిపించకపోవడం బాధాకరమని అన్నారు.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..