Radhika Yadav Last rites: కుటుంబ సభ్యుల మధ్య ముగిసిన రాధిక అంత్యక్రియలు
ABN , Publish Date - Jul 11 , 2025 | 09:43 PM
రాధిక హత్యకు సంబంధించి పోలీసుల సమాచారం ప్రకారం, సామాజిక మాధ్యమాల్లో అదేపనిగా రీల్స్ చేస్తుండటం, ఆమె తీరుకారణంగా తెలిసి వాళ్ల ఎదుట తలెత్తుకోలేకపోతున్నాననే కారణంతో ఈ హత్య చేసినట్టు దీపక్ అంగీకరించాడు.

గురుగ్రామ్: హరియాణా క్రీడాకారిణి రాధికా యాదవ్ (Radhika Yadav) అంత్యక్రియలు గురుగ్రామ్‌లో శుక్రవారంనాడు ముగిసాయి. రాధికను స్వయానా ఆమె తండ్రి దీపక్ యాదవ్ గురువారం హత్య చేయడం తీవ్ర సంచలనమైంది. ఈ హత్యను దీపక్ యాదవ్ అంగీకరించడంతో ఆయనను ఒకరోజు పోలీసు కస్టడీకి పంపారు. రాధిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంత్రక్రియలు పూర్తిచేశారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు కన్నీటి వీడ్కోలు పలికారు.
సామాజిక మాధ్యమాల్లో అదేపనిగా రీల్స్ చేస్తుండటం, ఆమె తీరుకారణంగా తెలిసి వాళ్ల ఎదుట తలెత్తుకోలేకపోతున్నాననే కారణంతో ఈ హత్య చేసినట్టు దీపక్ అంగీకరించాడు. కూతురు సొమ్ములతో బతుకుతున్నట్టు కొందరు అవహేళన చేయడం తట్టుకోలేకపోయానని, గత 15 రోజులు ఒత్తడికి గురయ్యాయని అతను ఒప్పుకున్నాడు. తమది సంపన్న కుటుంబమని, రాధిక పనిచేయాల్సిన అవసరం లేదని కూడా దీపక్ వెల్లడించాడు.
నిందితుడు దీపక్ రెంటల్ బిజినెస్ నడుపుతున్నాడని, రాధిక టెన్నిస్ అకాడమీ నడపడం అతనికి ఇష్టం లేదని, అయితే తనకు అకాడమీ నడపడం ఇష్టం కావడంతో ఆమె దానిని కొనసాగిస్తూ వచ్చిందని గురుగ్రామ్ పోలీస్ పీఆర్ఓ సందీప్ కుమార్ తెలిపారు. అకాడమీ మూసేయాలని మరోసారి తండ్రి గట్టిగా చెప్పడం, ఆమె వినకపోవడంతో దీపక్ కాల్పులు జరిపాడని చెప్పారు.
రాధిక హత్యకు గురైన అపార్ట్‌మెంట్ రెండో ఫ్లోర్‌లోనే ఆమె అంకుల్ కుల్‌దీప్ యాదవ్ ఉంటున్నారు. కాల్పుల వంటి పెద్ద శబ్దం రావడంతో తాను కిందకు వచ్చానని, ఇంట్లో రక్తపు మడుగులో రాధిక పడి ఉంటటంతో వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసిందని ఆయన చెప్పారు. తన సోదరుడికి లైసెన్స్‌డ్ 32 బోర్ రివాల్వర్ ఉందని, దానితోనే ఈ కాల్పులు జరిపినట్టు వివరించారు. కాల్పులు జరిగిన సమయంలో ఫస్ట్ ఫ్లోర్‌లో రాధిక, ఆమె తల్లి, దీపక్ ఉన్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ముందు నుంచే 4 బుల్లెట్లు దూసుకెళ్లాయి.. రాధికా యాదవ్ పోస్ట్‌మార్టంలో వెల్లడి
భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ డోభాల్ సవాల్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి