Share News

CM Revanth: రామ్‌లీలా మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం

ABN , Publish Date - Dec 14 , 2025 | 04:26 PM

ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు అప్పుడు.. దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, పేదల ఓటు హక్కును లాగేసుకోవాలని ప్రయత్నించారని.. ఇప్పుడు అదే భావజాలం కలిగిన బీజేపీ..

CM Revanth: రామ్‌లీలా మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం
Vote Chor Gaddi Chhod

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 14: కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' మహా ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ఈ భారీ నిరసన ప్రదర్శనలో రేవంత్ రెడ్డి.. బీజేపీ, ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు.. దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, పేదల ఓటు హక్కును లాగేసుకోవాలని ప్రయత్నించారు. కానీ మహాత్మా గాంధీ, అంబేడ్కర్ తదితరుల పోరాటంతో వారికి ఓటు హక్కు వచ్చింది. ఇప్పుడు అదే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కలిగిన బీజేపీ మళ్లీ ఆ ఓట్లను లాగేసుకోవాలని చూస్తోంది' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.


ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ పోరాటం కీలకమని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర జాతీయ నేతలతో పాటు రేవంత్ రెడ్డి ప్రసంగానికి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల నుంచి భారీ స్పందన లభించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల

విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 14 , 2025 | 04:26 PM