Tamil Name Board: నేమ్‌బోర్డులు తమిళంలో లేకుంటే 2వేలు ఫైన్
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:55 AM
తమిళంలో నేమ్‌బోర్డులు ఏర్పాటు చేయని సంస్థలకు మే నెల నుంచి రూ. 2వేల జరిమానా విధించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, దుకాణాలు, హోటళ్లు ఇలా అన్ని చోట్ల తమిళంలో పెద్దగా, ఇంగ్లిష్‌లో చిన్నగా పేర్లు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది

చెన్నై, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): తమిళంలో నేమ్‌బోర్డులు ఏర్పాటుచేయని సంస్థలకు రూ.2వేల జరిమానా విధిస్తామని, మే నెల నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుందని రాష్ట్ర తమిళ అభివృద్ధి శాఖ మంత్రి స్వామినాథన్ హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, దుకాణాలు ఏర్పాటుచేసే నేమ్ బోర్డుల్లో తమిళం పెద్దదిగా, ఇంగ్లిష్ చిన్నదిగా, తర్వాత వారు కోరుకున్న భాషలో పేర్లు ఉండాలని ఇటీవల ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నేమ్ బోర్డులు తమిళంలో ఉండేలా కలెక్టర్లు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తిరుప్పూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామినాథన్ మాట్లాడుతూ.. తమిళంలో నేమ్ బోర్డులు ఏర్పాటుచేయని యజమానులకు మే నుంచి జరిమానా విధిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..