Minister: చిక్కుల్లో రాష్ట్రమంత్రి.. ఆ వ్యాఖ్యలే ఆయన కొంపముంచనున్నాయా..
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:26 AM
రాష్ట్ర మంత్రి ఒకరు చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అటు ప్రభుత్వానికి, ఇటు మంత్రికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. రాష్టప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని పలు పార్టీలు, సంస్థలు డిమాండ్ మొదలుపెట్టాయి.

- మహిళలపై మంత్రి వ్యాఖ్యల వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు
చెన్నై: మహిళలు, శైవ, వైష్ణవ మతాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి పొన్ముడి(Minister Ponmudi)ని మంత్రి పదవి నుండి డిస్మిస్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌కు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం సూచించింది. విల్లుపురం సమీపంలో ద్రావిడ కళగం ఆధ్వర్యంలో ఈ నెల 8న జరిగిన సభో మంత్రి పొన్ముడి మాట్లాడుతూ ఓ వేశ్య, విటుడి మధ్య జరిగిన సంభాషణలు చెబుతానంటూ మహిళలను, శైవ, వైష్ణవ మతాలను కించపరిచేలా అశ్లీలకరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Sikkim: సిక్కింలో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకున్న 1000 మంది పర్యాటకులు..
ఈ నేపథ్యంలో రెండు మతాలను కించపరిచేలా ప్రసంగించిన పొన్ముడిని మంత్రిపదవి నుండి డిస్మిస్ చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ హైకోర్టులో న్యాయవాది పి.జగన్నాథ్ పిటిషన్ వేశారు. పొన్ముడి వ్యాఖ్యలు రాజ్యాంగ ధర్మాసనానికి వ్యతిరేకమైనవని ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉన్నప్పుడే మంత్రి అక్రమార్జన కేసులపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ శైవ, వైష్ణవమతాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పొన్ముడిపై పోలీసులు ఎందుకు కేసు నమోదుచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
పోలీసులు వీలైనంత త్వరగా పొన్ముడిపై కేసు నమోదు చేయకపోతే తామే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం మళ్ళీ ఈ విషయంపై విచారణకు రాగా పొన్ముడిపై దాఖలైన ఇలాంటి కేసు హైకోర్టు మదురై డివిజన్ బెంచ్‌లో విచారణకు వచ్చిందని, పొన్ముడి చేసిన వ్యాఖ్యలు అశ్లీలంగా, అసభ్యకరంగా లేవని ఆ కేసును తోసిపుచ్చారని ప్రభుత్వ తరఫు న్యాయమూర్తి విల్సన్ తెలిపారు. పొన్ముడి మాటలు ద్వేషపూరిత ప్రసంగాల పరిధిలోకే వస్తుందని, ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ పేర్కొన్నారు.
ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి ప్రతిపాదించేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పొన్ముడిని డిస్మిస్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిసన్ గురువారం ప్రధాన న్యాయమూర్తి శ్రీరామ్, న్యాయమూర్తి మహ్మద్ సబీక్‌తో కూడిన ప్రధమ ధర్మాసం ఎదుట విచారణకు వచ్చింది.
ఈ కేసుకు సంబంధించి పిటిషనర్ దాఖలు చేసిన అదనపు పిటిషన్‌లో ఈ కేసుతో సంబంధం లేని ముఖ్యమంత్రిని రచ్చకీడ్చేలా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారని, ఆ అభిప్రాయాలను తొలగించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపిన వివరాలను తొలగించేందుకు పిటిషనర్ అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించి జూన్ 5లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రథమధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
దేశ భద్రతపై కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు
పంచాయతీలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికి నిధుల్లేవు!
కౌశిక్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట
పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు
Read Latest Telangana News and National News