Share News

Dy CM: సివిల్స్‌ విజేతలకు ప్రభుత్వ నజరానా..

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:42 PM

సివిల్స్‌ విజేతలకు రాష్ట్ర ప్రభుత్వ నజరానా ప్రకటించింది. ఈమేరకు.. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఢిల్లీ వెళ్లేందుకు రవాణా ఖర్చులకు తలా రూ.50వేలు అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తెలిపారు.

Dy CM: సివిల్స్‌ విజేతలకు ప్రభుత్వ నజరానా..

- రవాణా ఖర్చులకు తలా రూ.50 వేలు

- ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి

చెన్నై: యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఢిల్లీ వెళ్లేందుకు రవాణా ఖర్చులకు తలా రూ.50వేలు అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) తెలిపారు. శాసనసభ సమావేశాల్లో బుధవారం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ... సివిల్స్‌ సహా పలు పోటీ పరీక్షలకు ‘నాన్‌ ముదల్వన్‌’ పథకం కింద శిక్షణ ఇస్తున్నామన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Supreme Court: మీకు మంత్రి పదవా.. బెయిలా.. ఏది కావాలి..


ఆ ప్రకారం, సివిల్స్‌ పరీక్షలకు శిక్షణ తీసుకున్న 134 మందిలో 50 మంది 2024 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 2021లో యూపీఎస్సీ పరీక్షల్లో రాష్ట్రానికి చెందిన 27 మంది మాత్రమే ఉత్తీర్ణులు కాగా, ప్రస్తుతం 57 మంది ఉత్తీర్ణులు కావడం అభినందనీయమన్నారు.


nani4.jpg

ఉత్తీర్ణులైన 57 మందిలో 50 మంది రాష్ట్ర ప్రభుత్వ ‘నాన్‌ ముదల్వన్‌’ పథకంలో శిక్షణ పొందారని తెలిపారు. యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రూ.10 కోట్లు కేటాయించామన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఢిల్లీ వెళ్లేందుకు తలా రూ.50వేలు ప్రోత్సాహక నిధి అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

బిర్యాని.. బీ కేర్‌ఫుల్‌..

చంచల్‌గూడ జైలుకు అఘోరీ

ఫినాయిల్‌, సబ్బుల పైసలు నొక్కేశారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2025 | 01:42 PM