Share News

Chief Minister MK Stalin: సీఎం స్టాలిన్‌కు ఆంజియోగ్రామ్‌.. ఆస్పత్రిలోనే మరో రెండు రోజులు

ABN , Publish Date - Jul 25 , 2025 | 12:54 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆంజియోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించారు. అందులో గుండె పనితీరుకు సంబంధించిన ఫలితాలు అన్నీ సవ్యంగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 21న స్టాలిన్‌ వాకింగ్‌ చేస్తున్నప్పుడు స్వల్ప అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Chief Minister MK Stalin: సీఎం స్టాలిన్‌కు ఆంజియోగ్రామ్‌.. ఆస్పత్రిలోనే మరో రెండు రోజులు

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)కు ఆంజియోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించారు. అందులో గుండె పనితీరుకు సంబంధించిన ఫలితాలు అన్నీ సవ్యంగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి(Apollo Hospital) యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 21న స్టాలిన్‌ వాకింగ్‌ చేస్తున్నప్పుడు స్వల్ప అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇక్కడ రెండు రోజులపాటు వైద్యనిపుణులు ఆయనకు పలు పరీక్షలు జరిపారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న స్టాలిన్‌ రెండు రోజులుగా ఆస్పత్రి నుంచే వివిధ జిల్లాల కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు.


పథకాల అమలుపై సమీక్షలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌ అపోలో ఆస్పత్రికి వెళ్ళి స్టాలిన్‌ పరామర్శించి, ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వెలుపల దురైమురుగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ కులాసాగా ఉన్నారని, ఆంజియో గ్రామ్‌ పరీక్ష కూడా జరిగిందని, వాటి ఫలితాలు సంతృప్తికరంగానే ఉన్నాయని వైద్యనిపుణులు చెప్పారన్నారు.


nani1.2.jpg

సీఎం స్టాలిన్‌ను ఎప్పుడు డిశ్చార్జ్‌ చేయాలనే విషయమై ఆస్పత్రి వైద్యులే నిర్ణయం తీసుకుంటారని, తనకు తెలిసినంతవరకు ఆయన రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆరోగ్య పరిస్థితులు గురించి అపోలో యాజమా న్యం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్‌ వాకింగ్‌కు వెళుతుండగా తలతిరుగుతున్నట్లు అనిపించడంతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారని, ఆయనకు మూడు రోజులుగా అన్ని రకాల వైద్యపరీక్షలు జరిపామని అపోలో వైద్యసేవల విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌ పేర్కొన్నారు.


ఆస్పత్రిలోని హృద్రోగ శస్తచికిత్సా నిపుణుడు డాక్టర్‌ జి.సెంగొట్టువేలు నాయకత్వంలోని వైద్యనిపుణుల కమిటీ సలహా మేరకు గురువారం ఉదయం ఆంజియోగ్రామ్‌ పరీక్షలు జరిపినట్లు తెలిపారు. వాటి ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, రెండు రోజుల తర్వాత ఆయన యథావిధిగా తన విధులను చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

సీఎం త్వరగా కోలుకోవాలి: టీవీకే నేత విజయ్‌

చెన్నై: ముఖ్యమంత్రి స్టాలిన్‌ త్వరగా కోలుకోవాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌ పేజీలో... ‘తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ త్వరగా కోలుకుని తన విధులు తిరిగి ప్రారంభించాలి’ అంటూ ఆయన పోస్ట్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య

Read Latest Telangana News and National News

Updated Date - Jul 25 , 2025 | 12:54 PM