Share News

Archana Patnayak: ఓట్ల తొలగింపు అంశంపై ఎన్నికల అధికారి క్లారిటీ.. ఆమె ఏమన్నారంటే..

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:43 PM

విచారణ జరపకుండా ఒక్క ఓటు కూడా తొలగించలేరు.. అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌ స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. కాగా... ఓట్ల తొలగింపు అంశపై వస్తున్న ఆరోపణలపై న్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌ మాట్లాడారు.

Archana Patnayak: ఓట్ల తొలగింపు అంశంపై ఎన్నికల అధికారి క్లారిటీ.. ఆమె ఏమన్నారంటే..

  • విచారణ జరపకుండా ఒక్క ఓటూ తొలగించలేరు..

  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌

చెన్నై: ఎలాంటి విచారణ జరపకుండా ఓటరు జాబితా నుండి ఓటర్‌ను తొలగించడం సాధ్యంకాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌(Archana Patnayak) స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6.16కోట్ల ఓటర్లకు దరఖాస్తు ఫారాలు పంపిణీ చేసినట్లు వివరించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పనులు జరుగుతున్నాయి.


ఈ నేపథ్యంలో సర్‌కు సంబంధించి సచివాలయంలో సోమవారం ఉదయం ఈసీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అర్చనా పట్నాయక్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు నేతలు సర్‌ ప్రక్రియపై అడిగిన ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 234 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల ద్వారా సుమారు 50శాతం ఫారాలను స్వీకరించినట్లు తెలిపారు.


nani3.2.jpg

ఎలాంటి విచారణ లేకుండా ఓటరు జాబితా నుండి ఓటర్లను తొలగించడం సాధ్యం కాదన్నా రు. 68,647 మంది బీఎల్వోలు సహా 2.45 లక్షల మంది సర్‌ విధుల్లో పాల్గొంటున్నారని, దేశంలో తమిళనాడులో మాత్రమే సర్‌పై ఎక్కువ మంది బీఎల్వోలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. చెన్నైలో 96 శాతానికి పైగా సర్‌ దరఖాస్తు ఫారాల వినియోగం జరిగిందని, పూర్తిచేసిన ఫారాల స్వీకరణ గడువు పొడిగించే అవకాశం లేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత

అది బూటకపు ఎన్‌కౌంటర్‌: ఈశ్వరయ్య

Read Latest Telangana News and National News

Updated Date - Nov 25 , 2025 | 12:43 PM