Share News

Shock: చాలా రోజులు ఖాళీగా ఇల్లు.. డోర్ ఓపెన్ చేయగా షాక్..

ABN , Publish Date - Apr 11 , 2025 | 08:07 AM

కర్నాటక రాష్ట్రంలోని దండేలి పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా ఉన్న రూ. 5 వందల నోట్ల కరెన్సీ, నోట్లు లెక్కింపు యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేపి దర్యాప్తు చేపట్టారు.

Shock: చాలా రోజులు ఖాళీగా ఇల్లు.. డోర్ ఓపెన్ చేయగా షాక్..
Currency

బెంగళూరు: ఉత్తర కన్నడ జిల్లా (North Kannada district)లోని దండేలి పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో సుమారు రూ. 14 కోట్ల (Rs 14 crores) అనుమానాస్పద కరెన్సీ నోట్లు, కరెన్సీ లెక్కింపు యంత్రాన్ని పోలీసులు (Police) స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలి పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో గోవా (Goa)కు చెందిన వ్యక్తి అద్దె (Rent)కు ఉండేవాడు. అయితే చాలా కాలంగా అతను ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన ఇంటి యజమాని ఇంటిని చూడడానికి వెళ్ళాడు. అయితే ఇంటి వెనుక తలుపు తెరిచి ఉండటాన్ని గమనించాడు. దీంతో ఆయనకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Also Read..: మార్క్ శంకర్ ఆరోగ్యంపై కీలక అప్ డేట్


హుటాహుటిన ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు తనిఖీ చేశారు. ఇంట్లో ఓ మూల 500 రూపాయల డినామినేషన్ నోట్ల కట్టలను చూసి షాక్ అయ్యారు. అయితే అవి అసలు నోట్లు కావు. కానీ నిజమైన కరెన్సీగా పోలి ఉన్నాయి. ఆ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులుగా ‘రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ఉంది. ఆ నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ సంతకం కూడా లేదు. అంకెలు లేకుండా సున్నాలతో తయారు చేసిన సీరియల్ నంబర్లు ఉన్నాయి. ‘ఓన్లీ సినిమా షూటింగ్ పర్పస్’, ‘స్పెసిమెన్‘ అని కూడా అందులో ఉంది. ఆ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేపి దర్యాప్తు చేపట్టారు. ఆ నోట్లు చట్టబద్ధమైనవి కాదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎందుకు అక్కడ ఉన్నాయా తెలుసుకోడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక్కసారిగా మారిన వాతావరణం..

పోలీసులపై గోరంట్ల మాధవ్‌ దౌర్జన్యం

For More AP News and Telugu News

Updated Date - Apr 11 , 2025 | 08:07 AM