Supreme Court: బెట్టింగ్ యాప్‌ల విషయంలో కేంద్రంపై సుప్రీం సీరియస్
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:30 AM
బెట్టింగ్ యాప్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ అంశంపై కేంద్రం కౌంటర్ దాఖలు

కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం
మరోసారి కేంద్రంతోపాటు రాష్ట్రాలు, యాప్‌ల నిర్వహణ సంస్థలకు నోటీసులు
తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ యాప్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ అంశంపై కేంద్రం కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మార్చి 26న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, గత విచారణ సందర్భంగా దీనిపై స్పందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు మళ్లీ విచారణ చేపట్టింది. అయితే, గత విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చినప్పటికీ, కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కేంద్రంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బెట్టింగ్ యాప్‌లను కేంద్రం సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా? బెట్టింగ్ యాప్‌ల నిషేధానికి ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం వైఖరి తెలుసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
తప్పతాగి డ్యూటీకి.. అడ్డంగా జనానికి దొరికిపోయిన ఎస్ఐ
మాజీ క్లర్క్ అవినీతి దందా.. 15వేల జీతం.. 30 కోట్ల ఆస్తులు